Begin typing your search above and press return to search.

లియో ద‌ర్శ‌కుడు క‌న‌గరాజ్‌పై కోర్టులో కేసు

లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్, సందీప్ వంగా, వెట్రిమారన్, అరుణ్ మాథేశ్వరన్ వంటి దర్శకులు తమ సినిమాల్లో మితిమీరిన హింసను ప్రేరేపిస్తున్నార‌ని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:04 AM GMT
లియో ద‌ర్శ‌కుడు క‌న‌గరాజ్‌పై కోర్టులో కేసు
X

లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్, సందీప్ వంగా, వెట్రిమారన్, అరుణ్ మాథేశ్వరన్ వంటి దర్శకులు తమ సినిమాల్లో మితిమీరిన హింసను ప్రేరేపిస్తున్నార‌ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. విక్రమ్, లియో, కైతి (ఖైది) చిత్రాలను తెర‌కెక్కించిన‌ లోకేష్ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నారు. అయితే అత‌డు సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినీ విశ్వంలో హింసను లోకేశ్ ప్రేరేపిస్తున్నాడ‌ని ఆరోపిస్తూ మధురై కోర్టులో ఫిర్యాదు దాఖలైంది.

రాజా మురుగన్ అనే పిటిషనర్ ఈ కేసు వేసారు. హింసాత్మక చిత్రాలు తీస్తున్నందున లోకేష్‌కు మానసిక ప‌రిస్థితి ఎలా ఉందో పరీక్షించాలని కూడా పిటిషనర్ కోరారు. డ్రగ్స్ దుర్వినియోగం, శారీరక హింస వంటి నేరాలు చేసేలా యువకులను ప్రోత్సహిస్తున్నాడ‌ని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమాలకు సెన్సార్ చేసే చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను కోరాడు.

'ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా విజయ్ నటించిన `లియో` ర‌క్త‌పాతం, హింస‌తో సాగుతుంది. ఈ చిత్రం ర‌క్త‌పాత నేప‌థ్యం ఉన్న కుటుంబ హీరో క‌థ‌. హింసాత్మక యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లడీ స్వీట్ అనేది ట్యాగ్‌లైన్. హింస‌పై లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఇలా అన్నారు. సినిమాల్లో ఇలాంటివి చూపిస్తే స‌రే కానీ రియల్ లైఫ్‌లో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పొడుచుకోవడం చూస్తే, అది సరదా కాదని మనకు తెలుసు కాబట్టి మనం తల తిప్పుకుంటాము.. అని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో లోకేష్ క‌న‌గ‌రాజ్ అన్నారు.