Begin typing your search above and press return to search.

గాజు గ్లాస్ మీద ఈసీ డెసిషన్ ఇంకా ఉందా ?

గాజు గ్లాస్ కాదు కానీ ఇపుడు అది కాస్తా పగిలి కూటమికి గుచ్చుకుంటోంది. ఫ్రీ సింబల్ గా దానిని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   30 April 2024 6:42 AM GMT
గాజు గ్లాస్ మీద ఈసీ డెసిషన్ ఇంకా ఉందా ?
X

గాజు గ్లాస్ కాదు కానీ ఇపుడు అది కాస్తా పగిలి కూటమికి గుచ్చుకుంటోంది. ఫ్రీ సింబల్ గా దానిని ప్రకటించారు. దాంతో దాదాపుగా ముప్పయి నుంచి నలభై నియోజకవర్గాలలో దానికి వారికి కేటాయించేశారు. ఇది జనసేన అఫీషియల్ గా పోటీ చేస్తున్న నియోజకవర్గాల కంటే రెట్టింపు.

దాంతో టీడీపీ కూటమిలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. తాము కామన్ సింబల్ గా చేయమని చెబితే ఇలా ఫ్రీ సింబల్ చేశారు అని జనసేన మండిపడుతోంది. దీని మీద ఆ పార్టీ కోర్టుకు వెళ్ళింది. నిజానికి ఈ విషయంలో జనసేన సీరియస్ గానే ఉంది. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పై జనసేన న్యాయ స్థానాలలోనే తేల్చుకోవాలని చూస్తోంది. అందుకే నేరుగా హైకోర్టును ఆశ్రయించింది.

తమ పార్టీ మొత్తం 175 సీట్లలో పోటీకి పెట్టగలిగే సత్తా ఉన్నా తాము టీడీపీ కూటమితో పొత్తులో ఉన్నందునే కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని కోర్టు దృష్టికి జనసేన తీసుకుని వచ్చింది. ఆ విధంగా పొత్తులు ఉండడం వల్లనే తాము మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని వివరించింది.

అయితే తాము పోటీలో లేకపోతే తమ గుర్తుని కాస్తా ఫ్రీ సింబల్ అని చెప్పి జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడం ఏమిటి అని ఆ పార్టీ కోర్టులో దాఖలు చేసిన పిటిషం లో పేర్కొంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం మీద జనసేన న్యాయపరంగా సవాల్ చేసింది.

అదే విధంగా ఈసారి ఎన్నికల్లో తాము రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని కూడా కోర్టుకు వివరించింది. అందువల్ల తాము మిగిలిన చోట పొత్తులో ఉన్న బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉన్నామని పేర్కొంది.

ఈ విషయం ఇంత క్లారిటీగా ఉంటే ఫ్రీ సింబల్ పేరుతో స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారని కోర్టు ద్వారా ఈసీని ప్రశ్నించింది. ఇక ఈ విషయం మీద ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ ని వివరణ కోరినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈసీ 24 గంటలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చకు వస్తోంది. ఈసీ నిబంధనల ప్రకారం చూస్తే ఫ్రీ కామన్ సింబల్ విషయంలో విచక్షణాధికారం వారికే ఉంటుంది. రూల్ ఈజ్ రూల్ అని గుర్తింపు లేని అన్ని పార్టీలకు ఒకే విధమైన పద్ధతినే అనుసరిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇపుడు జనసేన విషయంలో కామన్ సింబల్ చేస్తే కుండ గుర్తుని కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి కామన్ సింబల్ ఇవ్వాలి. జై భారత్ పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణకు కూడా కామన్ సింబల్ ఇవ్వాలి. మరి ఈసీ డెసిషన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈసీదే విచక్షణాధికారం. ఈసీ దే ఫైనల్. స్వతంత్ర సంస్థ అయిన ఈసీ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఉత్కంఠను రేపుతోంది ఒక విధంగా గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ చేయడంతో ఏపీ రాజకీయాలే తారు మారు అయ్యే పరిస్థితి ఉంది. దాంతో అందరి చూపూ ఈసీ మీదనే ఉంది అని అంటున్నారు.