ఆ అర్హత ఉంటే భరణం అడగద్దు.. భార్యకు సుప్రీం హితవు..
భార్య, భర్తల బంధాలు నేడు పాతాళానికి దిగజారాయి. గతంలో భార్యలను వరకట్నం, వేధింపులతో భర్తలు, అత్తింటి వారు హింసలు పెట్టేవారు.
By: Tupaki Desk | 6 Aug 2025 3:00 PM ISTభార్య, భర్తల బంధాలు నేడు పాతాళానికి దిగజారాయి. గతంలో భార్యలను వరకట్నం, వేధింపులతో భర్తలు, అత్తింటి వారు హింసలు పెట్టేవారు. దీంతో గృహిణుల భద్రత కోసం ప్రభుత్వాలు బలమైన చట్టాలు తెచ్చాయి. వరకట్న వేధింపుల కేసులో ఏడేళ్ల జైలు శిక్ష లాంటి కఠిన మైన చట్టాలు తెచ్చిన ప్రభుత్వాలు.. భర్త భార్యను విడిచిపెట్టినా.. భర్త నుంచి భార్య విడిపోయినా భార్యకు, పిల్లలకు భర్త భరణంగా కొంత చెల్లించాల్సిందే. అన్ని దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో భార్యను విడిచిపెట్టిన వెంటనే భర్తకు సంబంధించిన సగం ఆస్తి భార్యకు వెళ్తుంది.
వెసులు బాలు కల్పిస్తున్న చట్టాలు..
భరణం విషయంలో చాలా దేశాల్లో నిబంధనలు ఉన్నాయి. ఈ మొత్తం నిబంధనల్లో లాభపడేది భార్యనే అని ఒప్పుకోకతప్పదు. మారిన చట్టాలతో ఆడవారికి అనేక వెసులుబాటులు కలిసివచ్చాయి. దీంతో పెళ్లి చేసుకోవడం ఆరు నెలల నుంచి ఏడాది భర్తకు దూరంగా ఉండడం.., మెయింటెనెన్స్ కోసం కేసులు వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ భరణం విషయంలో కోర్టులు ఎవరికీ నష్టం జరగకుండా వ్యవహరిస్తున్నా.. కొంతలో కొంత భర్త బాధింపబడుతున్నాడు.
అతుల్ సుభాష్ ను మరిచిన జనం..
గతంలో అతుల్ సుభాష్ భరణం కేసు విషయం సంచలనంగా మారింది. దేశంలో మగవాడి కోసం చట్టాలు లేవని.., దీంతో ఎంతో మంది కోర్టుల్లో జీవితకాలం మగ్గుతున్నారని, తనకు ఇక ఓపిక లేక సూసైడ్ చేసుకుంటున్నానని వీడియో తీసి రాష్ట్రపతి నుంచి ఎక్స్ అధినేత మస్క్ వరకు ట్యాగ్ చేశాడు. ఇది దేశంలో కొన్ని రోజులు బాగా చర్చ జరిగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. ఆడవారిని ఇబ్బందులు పెట్టద్దు.. కానీ వారికి చట్టం ఒక ఆయధంగా మారద్దని పలువురు వాదించారు.
అంత భరణం రాదని తేల్చి చెప్పి సుప్రీం కోర్టు..
గతంలో ఒక రాష్ట్రానికి చెందిన హై కోర్టు మహిళా న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో నేటికీ వైరల్ అవుతున్నాయి. కోట్లాది రూపాయల భరణం ఏంటని, భరణం అంటే దానికి ఉద్దేశించింది కాదని, కాస్మోటిక్, లగ్జరీ లైఫ్ స్టయిల్ కు భరణం ఇప్పంచలేమని న్యాయమూర్తి చెప్పింది. దీంతో పాటు అప్పుడప్పుడు సుప్రీం కోర్టు మహిళలను చీవాట్లు పెడుతూనే ఉంది. ఇటీవల ముంబైకి చెందిన ఒక గృహిణి వివాహం చేసుకున్న 18 నెలలకే భర్త నుంచి విడిపోవాలనుకుంది. భరణంగా రూ. 12 కోట్లతో పాటు భర్త పేరుపై ఉన్న లగ్జరీ ప్లాట్ ఇప్పించాలని కోరింది. దీనికి సమాధానంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ‘నువ్వు ఉన్నత విధ్య అభ్యసించావు. ఎవరిపై ఆధారపడకుండా జీవించవచ్చు.. అలా ఎందుకు చేయడం లేదు’ అని ప్రశ్నించింది. రూ. 12 కోట్లు ఇప్పించలేమని, కేవలం ప్లాట్ మాత్రమే భరణంగా ఇప్పిస్తామని చెప్పింది.
