Begin typing your search above and press return to search.

అడుగంటిపోయిన దేశభక్తిని పెంపొందించాలని... నిందితుడికి కోర్టు కీలక ఆదేశాలు

పాకిస్థాన్ కు అనుకూల నినాదాలూ చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 3:30 PM GMT
అడుగంటిపోయిన దేశభక్తిని పెంపొందించాలని... నిందితుడికి కోర్టు కీలక ఆదేశాలు
X

పాకిస్థాన్ కు అనుకూల నినాదాలూ చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతడిలో అడుగంటిపోయిన దేశభక్తిని పెంపొందించాలనుకుంది! ఇందులో భాగంగా... ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకూ పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని, "భారత్ మాతాజీ జై" అని నినాదాలు చేయాలని ఆదేశించింది.

అవును... మధ్యప్రదేశ్ లోని హైకోర్టు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా ఆసక్తికర ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా విచారణ ముగిసే వరకూ నెలకు రెండుసార్లు చొప్పున భోపాల్ పోలీస్ స్టేషన్లో 21 సార్లు జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని.. "భారత్ మాతా జీ జై" నినాదం చేయాలని ఆదేశించింది.

అనంతరం జస్టిస్ డీకే పలివాల్ నేతృత్వంలోని ధర్మాసనం అతడికి షరతులతో కుడిన బెయిల్ మంజూరు చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... భోపాల్ లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఫైజల్ అలియాస్ ఫైజాన్ పోలీసులు ఈ ఏడాది మే నెలలో అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు అనుకూల నినాదాలూ చేస్తున్నాడనే కారణంతో అదుపులోకి తీసుకుని ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153బీ కింద అతనిపై అభియోగాలు మోపారు.

ఈ సందర్భంగా ఫైజాన్ చర్యలు అసమ్మతిని ప్రోత్సహిస్తున్నాయని.. దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ సమయంలో రూ.50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై ఫైజాన్ ను బెయిల్ పై విడుదల చేయవచ్చని కోర్టు తీర్పులో జస్టిస్ పలివాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... బెయిల్ సందర్భంగా కోర్టు పలు ప్రత్యేక షరతులను విధించింది.

ఇందులో భాగంగా ఫైజాన్ తన విచారణ ముగిసే వరకూ ప్రతినెలా మొదటి, నాలుగవ మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని.. ఈ సందర్శనల సమయంలో తప్పనిసరిగా 21సార్లు పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరించిన జాతీయ జెండాకు వందనం చేయాలని.. రెండు సార్లు భారత్ మాతాకి జై నినాదం చేయాలని ఆదేశించింది.

తాను పుట్టి పెరిగిన దేశానికి గర్వకారణంగా భావించేందుకు ఈ ఆదేశాలు రూపొందించబడ్డాయని మధ్యప్రదేశ్ హైకోర్టు నొక్కి చెప్పింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు.. అతనికి నేర చరిత్ర ఉందని.. అతనిపై గతంలో 14 కేసులు ఉన్నాయని వాదించారు.