Begin typing your search above and press return to search.

జ్ఞానవాపీ మసీదు కేసు... అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు!

జ్ఞాన‌వాపి మసీదు హిందువుల పూజకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Feb 2024 6:23 AM GMT
జ్ఞానవాపీ మసీదు కేసు... అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు!
X

జ్ఞాన‌వాపి మసీదు హిందువుల పూజకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. మసీదు సెల్లార్‌ లో హిందువుల పూజలకు అనుమతించాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఈ ఏడాది జనవరి 31న తీర్పునిచ్చింది. ఇదే సమయంలో విశ్వనాథ్ విగ్రహాల పూజలకు ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆ తీర్పుపై దాఖలైన పిటిషన్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం.. ఆ ఆలయ గర్భ గుడిలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం జ్ఞానవాపి మసీదు విషయం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ జ్ఞానవాపి కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో వారణాసి జిల్లా కోర్టు... మసీదు సెల్లర్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ తీర్పును సవాల్ చేశారు మసీదు కమీటీ సభ్యుడు.

ఇందులో భాగంగా వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆ మసీదు సెల్లర్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని.. ఈ వ్యవహారన్ని మరోసారి లేవనెత్తాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించిందని తెలుస్తుంది!

కాగా... ఉత్తర‌ప్రదేశ్ లోని వార‌ణాసిలో గల పురాతన కట్టడంపై మతపరమైన వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయలో జ్ఞానవాపి మసీదు సెల్లార్‌ లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు జనవరి 31న తీర్పునిచ్చింది. ఇదే సమయంలో... టెంపుల్ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారి శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్.. కాశీవిశ్వనాథ్ విగ్రహాల పూజలకు ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

తాజాగా హైకోర్టుకు వెళ్లిన ఈ కేసు వ్యవహారంలో మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ ను కొట్టి వేసి.. హిందువులు పూజలు చేసేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మసీదు కమిటీ తెలిపిందని తెలుస్తుంది!