Begin typing your search above and press return to search.

వరకట్నం డిమాండ్ చేయడం నేరం కాదు... కండిషన్స్ అప్లై!

తాజాగా కేరళ హైకోర్టు కు వచ్చిన ఒక కేసులో... వాస్తవిక ఫిర్యాదుదారు అయిన భార్య, తన భర్త మరింత కట్నం కోసం డిమాండ్ చేసి, తన నివాసంలో తనపై దాడి చేశాడని ఆరోపించారు!

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:30 AM GMT
వరకట్నం డిమాండ్  చేయడం నేరం కాదు... కండిషన్స్  అప్లై!
X

వరకట్నం అనే ఆచారం భారతదేశంలో ఇప్పటికీ ఆడపిల్లల తల్లితండ్రులకు సమస్యగానే ఉందని చెబుతారు! అయితే కొంతమంది భర్తను, భర్త కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి దీన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెడుతుంటారని అంటుంటారు. అయితే ఈ వరకట్నం విషయంలో ఇప్పటికే కేరళ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే తీసుకుంది!

వరకట్నం తీసుకునే వరుడి డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరకట్నం తీసుకునే విషయంలో సరికొత్త విషయాలు చర్చకు వచ్చాయి. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో... పెళ్లి సమయంలో వరుడి కుటుంబం డిమాండ్ చేయకున్నా.. వధువు తల్లిదండ్రులు ఆమెకు పెట్టుకునే బంగారు ఆభరణాలు, కానుకలు వంటివి వరకట్నం కాదని కేరళ హైకోర్టు పేర్కొంది.

అలాంటి కానుకలు వరకట్నం కిందకు రావని, వాటిని వరకట్న నిషేధ చట్టం కింద పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... క్రూరత్వం, వేదింపులు అనే అంశం లేకుండా వరకట్నం లేదా ఏదైనా ఆస్తి లేదా విలువైన భద్రత కోసం అడగడం నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొందని తెలుస్తుంది! క్రూరత్వం అనే అంశం లేకుండా కేవలం వరకట్నం అడగడం చేస్తే సెక్షన్ 498ఏ కింద నేరం వర్తించదని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది! ఆ డిమాండ్ క్రూరత్వంతో కూడినది అయితే మాత్రం నిందితుడికి ఆ సెక్షన్ వర్తిస్తుందని పేర్కొంది!

ఈ విషయంపై స్పందించిన జస్టిస్ పి. సోమరాజన్... "క్రూరత్వం" అనే అంశం లేకుండా కట్నం లేదా ఏదైనా ఆస్తి లేదా విలువైన భద్రత కోసం డిమాండ్ అనేది పేర్కొన్న నేరాన్ని ఆకర్షించదని.. కానీ ఈ రెండింటి మిశ్రమ ప్రభావం మాత్రం ఐపీసీ సెక్షన్ 498ఏ కింద పరిగణలోకి తీసుకోబడుతుందని తెలిపారు. తాజాగా ఒక మహిళ ఇచ్చిన అదనపు కట్నం డిమాండ్ కేసులో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది!

తాజాగా కేరళ హైకోర్టుకు వచ్చిన ఒక కేసులో... వాస్తవిక ఫిర్యాదుదారు అయిన భార్య, తన భర్త మరింత కట్నం కోసం డిమాండ్ చేసి, తన నివాసంలో తనపై దాడి చేశాడని ఆరోపించారు! అయితే.. దాడి స్వభావాన్ని వాస్తవ ఫిర్యాదుదారు లేదా విచారించిన సాక్షులు ఎవరూ వివరించలేదు! ఇదే సమయంలో దీని వల్ల ఎలాంటి దాడి లేదా గాయాలు జరిగినట్లు ఆధారాలు లేవని, ఇదే సమయంలో వైద్యపరమైన ఆధారాలు లేవని కోర్టు దృష్టికి వచ్చింది!

ఈ కోణంలో, సెక్షన్ 498ఏ కింద 'క్రూరత్వం' నేరంగా పరిగణించడానికి జీవిత భాగస్వామి లేదా వారి బంధువుల మధ్య చెదురుమదురుగా జరిగేవి, లేదా చిన్నపాటి వివాదాల సందర్భాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది!

ఇదే సమయంలో... భర్త, అతని సమీప బంధువులను ఇరికించే పద్దతిలో ఆలోచించడం వల్ల ఇది వారికి విపరీతమైన బాధలకు దారితీస్తుందని లేదా పార్టీల మధ్య వైవాహిక సంబంధాలను విచ్ఛిన్నం చేసే స్థాయికి కూడా వెళ్తుందని అపెక్స్ కోర్టు హెచ్చరించిందని జస్టిస్ సోమరాజన్ గుర్తు చేశారు! కేవలం భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి వివాదాల ఆధారంగా సెక్షన్ 498ఏ కింద నేరం ఆరోపిస్తూ కేసులను నమోదు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించలని అధికారులకు కోర్టు హెచ్చరికలు జారీ చేసింది!

Source : LiveLaw.in