Begin typing your search above and press return to search.

బాలికకు ఐ లవ్‌ యూ చెప్పడం పై హైకోర్టు సంచలన తీర్పు!

అవును... మైనర్ కు ఐ లవ్ యూ చెప్పిన విషయంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే ఒక సంచలన తీర్పును ఛత్తీస్‌ గఢ్ ఉన్నత న్యాయస్థానం తాజాగా వెలువరించింది.

By:  Tupaki Desk   |   27 July 2025 8:00 PM IST
బాలికకు ఐ లవ్‌ యూ చెప్పడం పై హైకోర్టు సంచలన తీర్పు!
X

పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఛత్తీస్‌ గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా... బాలికకు ఐ లవ్‌ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు.. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ సంజయ్‌ ఎస్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలును తిరస్కరించింది.

అవును... మైనర్ కు ఐ లవ్ యూ చెప్పిన విషయంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే ఒక సంచలన తీర్పును ఛత్తీస్‌ గఢ్ ఉన్నత న్యాయస్థానం తాజాగా వెలువరించింది. ఈ సందర్భంగా... ఒక మైనర్ బాలికకు 'ఐ లవ్ యూ' అని చెప్పినంత మాత్రాన్న అది లైంగిక వేధింపుల కిందకు రాదని, లైంగిక ఉద్దేశం స్పష్టంగా రుజువు కానంత వరకు పోక్సో చట్టం కింద నేరం కాదని తెలిపింది.

వివరాళ్లోకి వెళ్తే... 2019 అక్టోబర్ లో 15 ఏళ్ల బాలిక ఒకరు స్కూలు నుంచి ఇంటికి వెళ్తోన్న సమయంలో.. ఆమె వద్దకు వచ్చిన ఓ యువకుడు 'ఐ లవ్ యూ' అని చెప్పాడు. దీంతో బాలిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లు ఆ యువకుడిని మందలించి.. మరోసారి ఇలాంటి పని చేయకూడదని హెచ్చరించారు.

ఇదే సమయంలో... ఇంటికెళ్లిన బాలిక ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు కూడా చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా... తమ కుమార్తెను సదరు యువకుడు నిత్యం వేధిస్తున్నాడని, ఐ లవ్ యూ చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు! దీంతో... అతడిపై ఐపీసీ సెక్షన్ 354డీ, 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో కేసు కోర్టుకు చేరగా... సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో... ఛత్తీస్ గఢ్ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో.. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఈ సందర్భంగా... యువకుడు లైంగిక ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పాడని భావించలేమని బెంచ్ అభిప్రాయపడింది. అతడికి లైంగిక ఉద్దేశం లేకుండా.. ప్రేమిస్తున్నానని చెబితే దాన్ని లైంగిక వేధింపుల కేసులుగా పరిగణించలేమని వెల్లడించింది. యువకుడిని నిర్ధోషిగా ప్రకటించింది. రాష్ట్ర సర్కారు చేసిన అప్పీల్‌ ను తిరస్కరించింది.