వినియోగదారు ఫోరం పరిమితి చెప్పిన కలకత్తా హైకోర్టు
ఇంతకూ ఈ వ్యవహారం తెర మీదకు ఎందుకు వచ్చిందన్నది చూస్తే..
By: Tupaki Desk | 8 April 2025 1:00 PM ISTకీలక వ్యాఖ్య చేసింది కలకత్తా హైకోర్టు. వినియోగదారుల హక్కులు.. వారికి జరిగే నష్టాలను విచారించి.. వాణిజ్య సంస్థలకు ఫైన్ వేసే వినియోగదారుల ఫోరం పరిమితుల్ని తాజాగా స్పష్టం చేసింది. వినియోగదారుల ఫోరం అరెస్టు వారెంట్ జారీ చేయలేదని పేర్కొంది. కేవలం సివిల్ జైలుకు పంపేలా ఆదేశాలు మాత్రం ఇవ్వగలదన్న క్లారిటీని హైకోర్టు ఇచ్చింది. ఇంతకూ ఈ వ్యవహారం తెర మీదకు ఎందుకు వచ్చిందన్నది చూస్తే..
2013లో ట్రాక్టర్ కొనుగోలు కోసం ఫైనాన్స్ కంపెనీకి.. లోన్ తీసుకున్న వ్యక్తికి మధ్య రుణ ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి ఫైనాన్స్ కంపెనీ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఫోరంను ఆశ్రయించారు. దీనికి స్పందిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపజత్యంలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషనర్ కేసు దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఎలాంటి అరెస్టు వారెంట్ ను జారీ చేయడానికి చట్టం ఫోరానికి అధికారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధన పరిధికి వెలుపల ఉందన్నారు. పిటిషనర్ పై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పును ఇచ్చింది.
