Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' కు మ‌ద్ద‌తుగా ఆర్టిక‌ల్ 32?

అయితే పిల్ ని సుప్రీంకోర్టు నిరాక‌రించింది

By:  Tupaki Desk   |   22 July 2023 6:48 AM GMT
ఆదిపురుష్ కు మ‌ద్ద‌తుగా ఆర్టిక‌ల్ 32?
X

రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రిస్తూ 'ఆదిపురుష్' ని తెర‌కెక్కించార‌ని రిలీజ్ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా జ‌రిగిన ర‌చ్చ గురించి తెలిసిందే. రామాయ‌ణంలో పాత్ర‌ల్ని ఇష్టానుసారం ఎలా సినిమాగా తీస్తార‌ని...హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఆ పాత్ర‌ల్ని సృష్టించిన తీరుపై..సంభాష‌ణ‌ల‌పై కొంత నెగివిటీ స్ప్రెడ్ అయింది. దీనికి గానూ ర‌చ‌యిత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం జ‌రిగింది. అయితే సీబీఎఫ్ సీ ఇచ్చిన ఫిల్మ్ స‌ర్టిఫికెట్ ని వెన‌క్కి తీసుకోవాల‌ని ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యాన్ని న్యాయ‌వాది మ‌మ‌తా రాణి సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసే ప్ర‌య‌త్నం చేసారు.

అయితే పిల్ ని సుప్రీంకోర్టు నిరాక‌రించింది. జ‌స్టిస్ ఎస్ కె కౌల్..జ‌స్టీస్ సుధాంశ్ ధూలియాలితో కూడిన ధ‌ర్మాస‌నం న్యాయ‌వాది వాద‌న‌లు విని..ఆదిపురుష్ కి సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికెట్ జారీ చేసింద‌ని ..ఇప్పుడీ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం త‌గ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఆర్టిక‌ల్ 32 కింద ఎందుకు స్పందించాల‌ని ప్ర‌శ్నించింది. సుప్రీం కోర్టుకు వ‌చ్చిన ప్ర‌తీసారి ప్ర‌తీ విష‌యాన్ని స్ట్రూట్నీ చేయాలా? సినిమాలు.. పుస్త‌కాల‌పై ఇటీవ‌లికాలంలో స‌హ‌నంగా బాగా త‌గ్గిపోతుంద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

దీంతో 'ఆదిపురుష్' పై నెల‌కొన్న వివాదం పై నీలి నీడ‌లు కమ్మిన‌ట్లు అయింది. నేరుగా సుప్రీం కోర్టు పిల్ నిరాక‌రించ‌డంతో వాద‌న‌లు సినిమాకి మ‌ద్ద‌తుగా ఉన్న‌ట్లు చెప్పొచ్చు. ఇలాంటి పిల్స్ పై సుప్రీం విచార‌ణ జ‌ర‌ప‌డానికి కూడా ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. ఇక సినిమాల‌పై అభ్యంత‌ర‌క స‌న‌నివేశాలు.. కంటెంట్ ఉన్న సినిమాల‌పై కేసులు న‌మోదవుతోన్న సంగతి తెలిసిందే.

ఇప్ప‌టివ‌ర‌కూ వాటి తీర్పులు కూడా మేక‌ర్స్ కి అనుకూలంగానే వ‌చ్చాయి. తాజాగా 'ఆదిపురుష్' విష‌యంలోనూ అదే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వివాదంపై ఆర్టిక‌ల్ 32 వివాదాన్ని..విమ‌ర్శ‌ల్ని అలా ఆప‌గ‌లిగింది.

వాస్త‌వానికి ఆదిపురుష్ ర‌చ‌యిత కొన్ని సంభాష‌ణ‌ల‌పై వివ‌ర‌ణ తో పాటు ..అవ‌స‌రం మేర క్ష‌మాప‌ణ‌లు కోర‌డం జ‌రిగింది. సినిమాల కార‌ణంగా యువ‌త‌..చిన్న పిల్ల‌లు చెడిపోతున్నార‌ని న‌మోదైన కేసుల‌పై తీర్పు దర్శ‌క‌-నిర్మాత‌ల‌కు అనుకూలంగానే వ‌చ్చిన సంద‌ర్బాలెన్నో.