Begin typing your search above and press return to search.

మసాలా దోసెకు సాంబర్ ఇవ్వలేదు.. ఎంత ఫైన్ వేశారంటే?

దోసెతో పాటు సాంబార్ ఇవ్వని ఉదంతం

By:  Tupaki Desk   |   14 July 2023 5:32 AM GMT
మసాలా దోసెకు సాంబర్ ఇవ్వలేదు.. ఎంత ఫైన్ వేశారంటే?
X

ఆసక్తికర ఉదంతం ఒకటి బయటకు వచ్చి.. వైరల్ గా మారింది. సాధారణంగా హోటల్ కు వెళ్లినప్పుడు దోశెకు ఆర్డర్ ఇవ్వటం..హోటల్ అతను ఇవ్వటం మామూలే. కొన్ని హోటళ్లలో దోసెతో చట్నీతో పాటు సాంబార్ ఇస్తుంటారు.

కొన్ని హోటళ్లలో ఇవ్వరు. అయితే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోసెతో పాటు సాంబార్ ఇవ్వని ఉదంతంపై వినియోగదారుల కమిషన్ లో కంప్లైంట్ చేసిన వినియోగదారుడు సదరు హోటల్ కు ఫైన్ వేయించే విషయంలో సక్సెస్ అయ్యారు.

బిహార్ కు చెందిన మనీష్ పాఠక్ అనే లాయర్ ఈ విషయంలో విజయం సాధించారు. గతంలో దోసె.. ఇడ్లీ.. వడ లాంటి టిఫిన్లు దక్షిణ భారతంలోనే కనిపించేవి. ఉత్తరంలో కాస్త తక్కువగా ఉండేవి. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా చాలా హోటళ్లలో సౌత్ టిఫిన్లను అందిస్తున్నారు. బిహార్ లోని ఒక రెస్టారెంట్ కు వెళ్లిన మనీశ్ ఒక మాసాలా దోసె పార్శిల్ కు ఆర్డర్ చేశారు.

ఇందుకోసం రూ.140 చెల్లించాడు. ఇంటికి వెళ్లిన అతడు పార్శిల్ ను చూస్తే.. మసాలా దోసె.. చట్నీ తప్పించి దాంతో పాటు ఇవ్వాల్సిన సాంబార్ ఇవ్వలేదు. దీంతో హోటల్ ను సంప్రదిస్తే సానుకూల స్పందన రాలేదు.

దీంతో.. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మసాలా దోసెతో సాంబార్ ఇవ్వాల్సిన వైనం.. రెస్టారెంట్ చేసిన తప్పును కమిషన్ కు వివరించారు.

ఈ ఉదంతంపై 11 నెలల విచారణ సాగింది. అనంతరం.. తప్పు రెస్టారెంట్ దే అన్న విషయాన్ని కమిషన్ నిర్దారించింది. దీంతో.. సదరు హోటల్ కు రూ.3500 ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చింది. తామిచ్చిన తీర్పును 45 రోజుల్లో అమలు చేయాలని కండీషన పెట్టింది. తాము చెప్పిన జరిమానాను గడువులోపు చెల్లించని పక్షంలో 8 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది.