Begin typing your search above and press return to search.

ఏమిటీ జిర్కాన్ క్షిపణి.. ఉక్రెయిన్ పై రష్యా తొలిసారి ప్రయోగం

మహా అయితే రెండు వారాల్లో ముగుస్తుందని భావించిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అందరి అంచనాలకు భిన్నంగా నెలల తరబడి సాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:15 AM GMT
ఏమిటీ జిర్కాన్ క్షిపణి.. ఉక్రెయిన్ పై రష్యా తొలిసారి ప్రయోగం
X

మహా అయితే రెండు వారాల్లో ముగుస్తుందని భావించిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అందరి అంచనాలకు భిన్నంగా నెలల తరబడి సాగుతున్న సంగతి తెలిసిందే. ఒకదశలో రష్యా అధిక్యత కనిపించినా.. సుదీర్ఘంగా సాగుతున్న యుద్దం ఉక్రెయిన్ సత్తాను తక్కువగా అంచనా వేయటానికి లేదన్న విషయం నిరూపితమైంది. ఇలాంటి వేళ.. అందరి అంచనాలకు భిన్నంగా అనూహ్య రీతిలో రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన క్షిపణిని బయటకు తీసి.. ప్రయోగించిన విషయాన్ని ఉక్రెయిన్ గుర్తించింది.

అయితే.. రష్యా మాత్రం ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఉక్రెయిన్ పై తొలిసారి రష్యా ప్రయోగించిన పవర్ ఫుల్ అస్త్రం పేరు.. ‘‘జిర్కాన్’’. దీని ప్రత్యేకత ఏమంటే ప్రపంచంలో మరే దేశం కూడా ఈ క్షిపణిని ఢీ కొట్టే సత్తా లేకపోవటమే దీని స్పెషాలిటీ. తాజాగా కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ రష్యా ప్రయోగించిన తాజా క్షిపణిని గుర్తించింది. దాడి జరిగిన తీరు.. దాని విడిభాగాల ముక్కలు.. సేకరించిన శకాలాలను గుర్తించి.. వాటిని పరీక్షించగా అసలు విషయం బయటకు వచ్చింది. రష్యా తన అమ్ములపొదిలోనే అత్యంత శక్తివంతమైన జర్కాన్ క్షిపణిని తొలిసారి తన ప్రత్యర్థిపై ప్రయోగించింది.

ఇప్పటికే మాస్కో నుంచి నిత్యం ఎదురయ్యే దాడుల నుంచి తమను తాము కాపాడుకోవటానికి కీవ్ నగర గగనతలం రక్షణ వ్యవస్థ పూర్తిగా అలిసిపోయింది. ఇలంటి వేళ.. రష్యా తన జిర్కాన్ క్షిపణల్నిప్రయోగించటం షురూ చేయటం ద్వారా ఉక్రెయిన్ కు కొత్త సమస్యల్ని ఎత్తి చూపిందని చెప్పాలి. ఈ క్షిపణి ఒక్కసారి గాల్లోకి ఎగరటం మొదలైన తర్వాత దీన్ని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదని చెబుతున్నారు. ఈ క్షిపణి గంటకు 8900కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు. జిర్కాన్ ను అడ్డుకోవటం ఏ దేశ తరం కాదంటున్నారు. దీనికి కారణం దీని వేగమే.

ఈ క్షిపణి తాను ప్రయాణించే వేళలో తన అపరమిత వేగాన్ని చుట్టూ ప్లాస్మా మేఘాన్ని వలయంగా ఏర్పడుతుంది. అంతేకాదు.. రాడార్ సంకేతాల్ని తనలో కలిపేసుకుంటుందే తప్పించి.. ప్రత్యర్థులు ఆశించే ఫలితాన్ని ఇవ్వదు. దీంతో.. ఈ క్షిపణిని గుర్తించటం సాధ్యం కాదంటున్నారు. సాధారణంగా అమెరికాకు చెందిన ఏజిస్ క్షిపణి రక్షణ వ్యవస్థకు శత్రు అసత్రాలను నేల కూల్చటానికి 8-10సెకన్ల సమయం పడుతుంది. అయితే.. ఈ స్వల్ప వ్యవధిలో జిర్కాన్ క్షిపణి ఏకంగా 20కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.

ఈ కారణంతోనే ఏజిస్ క్షిపణికి కూడా రష్యా ప్రయోగించిన జిర్కాన్ అందదని చెబుతున్నారు. మెరుపు వేగంతో అమెరికా విమానవాహన నౌకల్ని ధ్వంసం చేసే సత్తా దీని సొంతమంటున్నారు. అమెరికాను దెబ్బ తీయటానికి డెవలప్ చేసి తయారు చేసిన దీని గురించి ఎంత మాట్లాడినా తప్పే కాదని చెప్పాలి. ఈ కారణాంగానే జిర్కాన్ ను ఒకనమ్మకమైన ఆయుధంగా పుతిన్ పేర్కొనాన్ని మర్చిపోకూడదు. అలాంటి క్షిపణిని ఇప్పుడు రష్యా బయటకు తీసిందంటే.. రానున్న రోజుల్లో యుద్దాన్ని మరింత విస్తరించి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటమే ముఖ్యమని చెబుతున్నారు.