యతి ప్రాసలతో పవన్ కల్యాణ్ పై రోజా పంచులు!
ఈ రోజు ఏపీలో నిరుద్యోగ సమస్యలపై 'యువత పోరుబాట' కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2025 3:11 PM ISTఈ రోజు ఏపీలో నిరుద్యోగ సమస్యలపై 'యువత పోరుబాట' కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ వద్ద యువకులు, నిరుద్యోగులు, విద్యార్ధులు నిరసన చేపడుతున్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగాలు లేకపోతే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు ఇచ్చిన హామీలను తక్షణం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టర్ లకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన రోజా... పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో యువత పోరుబాట కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోjaa... కూటమి ప్రభుత్వ పెద్దలు, డిప్యూటీ సీఎం పవన్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గబ్బర్ సింగ్ లా హామీల మాటలు చెప్పిన పవన్ ఇప్పుడు రబ్బర్ లా మారాడని అన్నారు.
ఇదే సమయంలో.. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చి యువత చెవుల్లో ఫ్లవర్ లు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా వాళ్లు మాత్రం జాబ్ లు తెచ్చుకున్నారని మండిపడ్డారు.
ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ తనకు డిప్యూటీ సీఎం జాబ్ తెచ్చుకున్నారని, తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ జాబ్ ఇప్పించుకున్నారని.. అయితే, ఎన్నికల్లో వాళ్ల మాటలు నమ్మి ఓటు వేసిన యువతను మాత్రం పట్టించుకోవడం లేదని రోజా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు.
ఈ సందర్భంగా... కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షలు ఇల్లు ఉన్నాయని, ఆ నిరుద్యోగుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీలో ఇప్పటివరకు ఒక టీచర్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.
