Begin typing your search above and press return to search.

మగాళ్లు నగ్నంగా పడుకుంటే ఫోటోలు తీస్తున్న మహిళ..!

నగ్నత్వాన్ని షూట్ చేసే విషయంలో చిత్రీకరించే విషయంలో ఇంతకాలం ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటోంది యుషి లీ అనే ఫోటోగ్రాఫర్

By:  Tupaki Desk   |   2 Aug 2023 1:30 PM GMT
మగాళ్లు నగ్నంగా పడుకుంటే ఫోటోలు తీస్తున్న మహిళ..!
X

నగ్నత్వాన్ని షూట్ చేసే విషయంలో, చిత్రీకరించే విషయంలో ఇంతకాలం ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అంటోంది యుషి లీ అనే ఫోటోగ్రాఫర్. ఇందులో భాగంగా పురుషులను నగ్నంగా మార్చి ఫోటో షూట్ లు చేస్తోంది. పైగా ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఫోజులు ఇవ్వాలో మగవారికి తెలియదని చెప్పుకొస్తోంది.

అవును... ఇంతకాలం మగ పెయింటర్లు, ఫోటోగ్రాఫర్లు శతాబ్దాలుగా మహిళలను నగ్నంగా చిత్రీకరిస్తున్నారు.. ఫోటోలు తీశారు.. అయితే ఆ ధోరణిని మార్చాలనుకుంటున్నాను.. ఇపుడు ఆ బ్రష్ నేను పట్టుకున్నా, నేను కోరుకున్న దాన్ని రూపొందిస్తా అని అంటోంది యుషి లీ అనే ఫోటో గ్రాఫర్.

చైనాలో పుట్టి.. ఇప్పుడు లండన్‌ లో నివసిస్తున్న యుషి లీ... ఫొటోగ్రఫీ కళలోనూ, లైంగిక ఆకర్షణ కళలోనూ మార్పు తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన ఫోటో షూట్ మొత్తం సెక్సువల్ ఎట్రాక్షన్, లైంగిక కోరికల చుట్టూ తిరుగుతుందని చెబుతోంది.

ఇందులో భాగంగా... తాను తీస్తోన్న ఫోటోలు పురుషుల శరీరాన్ని "లైంగిక ఆకర్షణ"కు కేంద్రంగా ఉపయోగిస్తాయని లీ చెబుతున్నారు. ఇదే సమయంలో మనుషులతో పోలిస్తే జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయని చెబుతోంది. సింహం, నెమలి వంటివాటిని ఉదాహరణలుగా పేర్కొంటోంది.

ఇదే క్రమంలో కొంతమంది పురుషులు డేటింగ్ యాప్‌ లలో సెమీ న్యూడ్ ఫోటోలను అప్‌ లోడ్ చేస్తారు కానీ.. అవి అంత ఆకర్షణీయంగా కనిపించవని అంటున్నారు లీ. దానికి కారణం... ఆకర్షణీయంగా, సెక్సీగా ఎలా ఉండాలనే దాని గురించి పురుషులు పెద్దగా ఆలోచించకపోవడమే అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు.

ఇక పురుషులు తమ గురించి ఎక్కువగా పట్టించుకోరు.. తమను తాము ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో ఆలోచించరు అని చెబుతున్న లీ... తన ఫోటోలలో పురుషులను సహజంగా, సాఫ్ట్‌ గా చూపించడం తనకు ఇష్టమని చెబుతున్నారు. అయితే ఇది కేవలం లైంగిక వాంఛ మాత్రమే కాదని.. సాధికారత కోసం పడే తపన అని ఆమె అనటం గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తుండటం కొసమెరుపు.