Begin typing your search above and press return to search.

ష‌ర్మిల స‌భ‌ల్లో.. 'జై జ‌గ‌న్‌' ఫైరెత్తిపోయిన చెల్లెమ్మ‌!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా కంటే కూడా.. సీఎం జ‌గ‌న్ సోద‌రిగానే అంద‌రికీ సుప‌రిచితురాలైన వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల‌కు ఠారెత్తి పోతోంది

By:  Tupaki Desk   |   8 April 2024 9:22 AM GMT
ష‌ర్మిల స‌భ‌ల్లో..  జై జ‌గ‌న్‌ ఫైరెత్తిపోయిన చెల్లెమ్మ‌!
X

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా కంటే కూడా.. సీఎం జ‌గ‌న్ సోద‌రిగానే అంద‌రికీ సుప‌రిచితురాలైన వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల‌కు ఠారెత్తి పోతోంది. ఒక‌వైపు మండు టెండ‌లు మ‌ల‌మ‌ల మాడ్చేస్తుంటే.. మ‌రోవైపు.. రాజ‌కీయాలు ఆమెకు సెగ‌పెడుతున్నాయి. సొంత అన్న‌పైనే ఆమె విరుచుకుప‌డుతూ.. రాజకీయాల్లో సెగ పుట్టిస్తున్నారు. అయితే.. ఆమె స‌భ‌ల్లో ఆమె కే సెగ‌లు పుట్టించేలా... సాధార‌ణ ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌డ‌పలో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు.

బ‌స్సు యాత్ర ద్వారా.. ఆమె ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తూ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ ప్ర‌చార స‌మ‌యం లో అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. స‌భ‌ల‌కు వ‌చ్చి.. బుద్ధిగా త‌న ప్ర‌సంగం వింటార‌ని ష‌ర్మిల ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఆమెకు ఇక్క‌డే ఎదురు గాలి వీస్తోంది. స‌భ‌ల‌కు జ‌నాలు వ‌స్తున్నారు. కానీ, వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్టు.. ఆమె మాట్లాడుతున్న స‌మ‌యంలో `జై జ‌గ‌న్‌` అంటూ నినాదాల‌తో హోరెత్తి స్తున్నారు. ఈ ప‌రిణామం.. ష‌ర్మిల‌కు ఫైరెత్తిస్తోంది.

ఈ ప‌రిణామం.. ష‌ర్మిల‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తోంది. దీంతో త‌న‌ను జ‌గ‌న్ మోసం చేశాడ‌ని.. ఇప్పుడు మీరు ఇంత ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నారు.. మిమ్మ‌ల్ని కూడా మోసం చేస్తాడ‌ని చెబుతున్నారు. అయితే.. క‌డ‌ప‌లో ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.. వైఎస్ కుటుంబంలో ష‌ర్మిల‌ను వైఎస్ వార‌సురాలిగా గుర్తించే విష‌యం లో త‌డ‌బాట్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో రెండు రోజుల పాటు క‌డ‌ప‌లోనే ష‌ర్మిల ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఆమెకు ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నేది చూడాల్సి ఉంటుంది.