Begin typing your search above and press return to search.

ముహూర్తం దగ్గరపడినవేళ... పార్టీ నేతలకు షర్మిల కీలక హామీ ఇదే

ఇందులో భాగంగా ఈ నెల 4న షర్మిళ తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు ప్రకటించారని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   2 Jan 2024 8:23 AM GMT
ముహూర్తం దగ్గరపడినవేళ... పార్టీ నేతలకు షర్మిల కీలక హామీ ఇదే
X

వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని.. ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఇంతకాలం వచ్చిన ఊహాగాణాలకు ఆల్ మోస్ట్ తెరపడినట్లే అని చెప్పే సంఘటన తాజాగా జరిగింది. ఇందులో భాగంగా లోటస్ పాండ్ లో మంగళవారం వైఎస్సార్టీపీ నేతలతో సమావేశం అయిన షర్మిళ... పార్టీ విలీనం, తన పార్టీ నేతల భవిష్యత్తుకు భరోసా, తాను అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వంటి కీలక విషయాలపై స్పందించారని తెలుస్తుంది.

అవును... పార్టీ ముఖ్యనేతలతో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల లోటస్‌ పాండ్‌ లోని పార్టీ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ విలీనంపై ఆమె పార్టీ నేతలకు ఒక తేదీని చెప్పినట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఈ నెల 4న షర్మిళ తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు ప్రకటించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశానికి సంబంధించి వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అదేరోజున పార్టీ విలీనంతోపాటు షర్మిళ ఎంట్రీ కూడా ఉంటుందని అన్నారు!

ఈ క్రమంలో... షర్మిల గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు! ఈ సందర్భంగా ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అన్నారు! ఈ సమయంలో... ఇంతకాలం తనను నమ్మి తనతోపాటు నడిచిన వైఎస్సార్టీపీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు!

మరోవైపు వైఎస్సార్టీపీ నేతలతో లోటస్ పాండ్ లో నిర్వహించిన కీలక భేటీ అనంతరం.. వైఎస్ షర్మిల ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం కోసం ఆమె వెళ్లనున్నారని తెలుస్తుంది. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియతో కలిసి షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారని సమాచారం!