Begin typing your search above and press return to search.

వైసీపీ సర్వేలో బయటపడిన నిజాలు...!?

వీరంతా కేవలం జగన్ మీదనే ఆధారపడుతున్నారు అని అంటున్నారు జరుగుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 March 2024 2:30 PM GMT
వైసీపీ సర్వేలో బయటపడిన నిజాలు...!?
X

వైసీపీ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తూ ఉంటుంది. అవి అంతర్గత సర్వేలుగా ఉంటున్నా చాలా వరకూ అందులోని విషయాలు ఏదో ఒకలా బయటపడుతూనే ఉంటున్నాయి. వైసీపీ సర్వేలను చూసుకునే అభ్యర్ధుల మార్పుచేర్పులు చేసింది. ఇపుడు కూడా సర్వేలనే ఆధారం చేసుకుని డే బై డే పొలిటికల్ యాక్టివిటీని డిజైన్ చేస్తోంది. అలా చూసుకుంటే కనుక లేటెస్ట్ గా చేయించిన ఒక సర్వేలో మాత్రం కొన్ని విషయాలు బయటపడ్డాయని అంటున్నారు.

ఇక తాజాగా చూస్తే కనుక వైసీపీ సిట్టింగులను మార్చి కొత్త వారికి చోటు కల్పించిన నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ వారికి సరిగ్గా పనిచేయడం లేదు అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మరో వైపు చూస్తే లోకల్ గా ఉండే సీనియర్ లీడర్స్ ని మార్చిన అభ్యర్థులు కలవడం లేదు అని అంటున్నారు.

వీరంతా కేవలం జగన్ మీదనే ఆధారపడుతున్నారు అని అంటున్నారు జరుగుతోంది అని అంటున్నారు. అలాగే చూస్తే కనుక లోకల్ గా ఉండే సోషల్ మీడియా ఆక్టివిటీ కూడా ఏమీ లేదు అని అంటున్నారు. జగన్ సంక్షేమ పధకాలు అమలు చేశారు అని చెబుతూ జనం లోకి వెళ్తున్నారు అని అంటున్నారు.

ఇక మొదటి నుంచి పెద్దగా ఆశలు పెట్టుకున్న వాలంటీర్లు ఇపుడు ఎన్నికల వేళ ఉండరని అంటున్నారు. దాంతో వారి మీద ఆధారపడాలని భావించిన వారికి చుక్కెదురు అవుతోంది అని అంటున్నారు. ఇది ఒక విధంగా దెబ్బగానే చూస్తున్నారు. ఇంకో వైపు చూస్తే గ్రామాల్లో పంచాయతీ సర్పంచులు ఉన్నారు.వార్డు మెంబర్స్ ఉన్నారు.

వీరంతా ఇపుడు పెద్దగా పనిచేయడం లేదు అని అంటున్నారు. చాలా చోట్ల చూస్తే క్యాడర్ నిద్రలేవడం లేదని అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలుగా పార్టీ వైపున ఉంటే ఇదే సర్వేలో మరికొన్ని కీలక అంశాలు బయటపడ్డాయని అంటున్నారు. అవేంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.

వారి విషయంలో చొరవ తీసుకుని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఏవీ జరగడం లేదు అని అంటున్నారు. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే జగన్ ఒక్కరే గేమ్ చేంజర్ గా పార్టీలో కనిపిస్తున్నారు. ఈసారి మొత్తం ఆయనే తిరగాల్సి ఉంటుంది. ఆయనే అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు.

జగన్ అన్ని నియోజకవర్గాలలో తప్పనిసరిగా ఈసారి తిరగాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇలా గ్రాస్ రూట్ లెవెల్ లో వైసీపీకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది అని అంటున్నారు. వీటిని సెట్ చేసుకుంటేనే వైసీపీ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

ఇపుడు ఈ రకంగా సర్వే రావడంతో వైసీపీ అధినాయకత్వం అలెర్ట్ అయింది అని అంటున్నారు. పార్టీలో ఉన్న గ్యాప్స్ ని పూర్తిగా తొలగించాల్సిన అవసరాన్ని పెద్దలు గుర్తించారు అని అంటున్నారు. అదే విధంగా పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదర్చడం ఇపుడు అతి ముఖ్యంగా ఉంది. అలాగే గత అయిదేళ్లలో పార్టీకి దూరం అయిన వివిధ సెక్షన్లను కూడా కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు.

అదే విధంగా పార్టీకి జీవనాడిగా ఉన్న వారు క్యాడర్. వారిలో చాలా కాలంగా నిర్లిప్తత ఉంది.దాన్ని తొలగించి వారిలో జోష్ పెంచాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. అలా చేస్తే తప్ప పార్టీకి పూర్తి స్థాయిలో పాజిటివిటీ రాదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ ఈ విషయాలు అన్నీ గమనించిన మీదటనే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టచ్ చేయాలని బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు అని అంటున్నారు.

ఏపీలో మొత్తం పాతిక దాకా పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ జగన్ కవర్ చేస్తారు అని అంటున్నారు. ఒక వైపు జనాలతో మమేకం అవుతూనే మరో వైపు పార్టీ నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుతారని, ప్రతీ నియోజకవర్గంలో సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ సర్వే ప్రకారం చూస్తే వైసీపీ క్షేత్ర స్థాయిలో బాగా సర్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.