Begin typing your search above and press return to search.

గోరంట్ల మాధవ్.. మారేది లేదుగా...!

పూర్వాశ్రమంలో పోలీస్, ఆనక డైరెక్ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిపోయారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 4:03 AM GMT
గోరంట్ల మాధవ్..  మారేది లేదుగా...!
X

పూర్వాశ్రమంలో పోలీస్, ఆనక డైరెక్ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిపోయారు. అలా లక్కీ తోడు కాగా నక్కకు తొక్కిన వారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన నాలుగున్నరేళ్లుగా వివాదాలకు కేరాఫ్ గా ముద్ర పడ్డారు. ఆయన నోరు జాస్తీతో పార్టీకి తనకూ కూడా చాలా సార్లు డ్యామేజ్ చేస్తూ వచ్చారు. గత ఏడాది అయితే ఆయన మీద న్యూడ్ వీడియో విమర్శలు వచ్చాయి. అది రచ్చ అయినపుడు ఆయన ఒక సామాజికవర్గం మొత్తాన్ని కూడా నిందిస్తూ నోరు పారేసుకున్నారు.

ఇక మరో వైపు చూస్తే అనంతపురం జిల్లాలో కియో కార్ల కర్మాగారం ఫంక్షన్ లో కూడా ఆర్భాటం చేసి సంస్థ వారి మీద గుస్సా అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక గోరంట్ల విమర్శించని నాయకుడు టీడీపీలో లేరు. ఆయన నోటి ధాటి వైసీపీకి ఇప్పటికే ఎంతో చేటు చేసింది. మరి కొద్ది నెలలలో వైసీపీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది.

దాని కోసం సామాజిక సాధికారిక బస్సు యాత్ర అంటూ జనంలోకి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రతినిధులను పంపించింది పార్టీ. అయితే అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో మాత్రం గోరంట్ల మాధవ్ దారుణమైన కామెంట్స్ చంద్రబాబు మీద చేశారు. తమ నాయకుడు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు అన్నది చెప్పుకోవచ్చు.

అదే సమయంలో చంద్రబాబు ఓడిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు చస్తారు అని అనడమేంటి. అసలు ఎంపీ ఏమి మాట్లాడుతున్నారు అన్నదే ఇపుడు అంతటా చర్చగా ఉంది. రాజకీయాల్లో ఓటములే ఉంటాయి తప్ప ఎలిమినేషన్స్ ఉండవు అన్నది ఈ మాజీ పోలీస్ అధికారి ప్రస్తుత ఎంపీ గారికి తెలియదా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది.

హిందూపురంలో ఈసారి ఎంపీకి టికెట్ దక్కదని అంతా అంటున్న నేపధ్యం ఉంది. దానికి ఆయన పనితీరు బాగా లేకపోవడంతో పాటు నోటి దురుసు వివాదాలకు కేరాఫ్ గా నిలవడం అని అంతా చెబుతారు. ఇపుడు చూస్తే ఆయన తనకు టికెట్ అక్కరలేదు అని అనుకుంటున్నారా లేదా ఇలాగే మాట్లాడితే టికెట్ ఇస్తారని అనుకుంటున్నారా అన్నదే అర్ధం కావడంలేదు అని అంటున్నారు.

తనకు వెనక బలమైన సామాజికవర్గం అండ ఉందని, తనకు కచ్చితంగా ఆ సామాజిక వర్గం తరఫున ఎమ్మెల్యేగా అయినా టికెట్ దక్కుతుంది అని భరోసాతోనే మాధవ్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేయాలని హై కమాండ్ ఆలోచించినా ఇపుడు ఆయన బాబు మీద చేసిన దారుణమైన కామెంట్స్ తో నిర్ణయం మార్చుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు.

ప్రస్తుతం చూస్తే చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. తన ప్రాణాలకు ముప్పు అని ఆయన ఒక వైపు లేఖలు రాస్తున్నారు. సరిగ్గా అదే టైం లో బాబు చస్తారు అని అధికార పార్టీ ఎంపీ బాహాటంగా కామెంట్స్ చేయడం అంటే ఏమనుకోవాలని అంటున్నారు. బాబు భద్రత విషయంలో టీడీపీకి అనుమానాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇపుడు యావత్తు జనాలకు అనుమానాలు ఉండేలా మాధవ్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా వైసీపీని ఇరకాటంలో పడేలా మాధవ్ కామెంట్స్ చేశారని అంటున్నారు. మొత్తానికి ఈ మాధవుడు మారరా అన్న చర్చ అయితే వైసీపీలో సాగుతోందిట.