Begin typing your search above and press return to search.

ఈ సీట్లు వైసీపీకి టఫ్... కూటమికి ప్లస్ ...!?

ఉత్తరాంధ్రా జిల్లాలలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లను గెలుచుకుని గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   21 March 2024 3:44 AM GMT
ఈ సీట్లు వైసీపీకి టఫ్... కూటమికి ప్లస్ ...!?
X

ఉత్తరాంధ్రా జిల్లాలలో 2019 ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లను గెలుచుకుని గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఉత్తరాంధ్రాలో ఇంతటి గ్రాండ్ విక్టరీ సాధించిన పార్టీ మరొకటి లేనే లేదు అన్నది పొలిటికల్ హిస్టరీ చెబుతున్న సత్యం.

మరి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి వైసీపీకి వీలు అవుతుందా అంటే కష్టం అన్నది క్లారిటీతో చెప్పే మాట. అయితే మెజారిటీ సీట్లు సాధించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ ఇటీవల మొత్తం జాబితాను రిలీజ్ చేసింది. ఉత్తరాంధ్రాలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది.

అందులో చూసుకుంటే కనుక కొంతమందికి టికెట్లు రావు అనుకున్న వారికి వచ్చాయి.వారి మీద వ్యతిరేకత కూడా ఇటు పార్టీలో అటు జనంలో కూడా ఉంది అని అంటున్నారు. మరి వారిని తప్పించకుండా టికెట్లు ఇవ్వడం అంటే ఎలా అర్ధం చేసుకోవాలి అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.

ఈ విధంగా చూస్తే ఇపుడు ఆ సీట్లే వైసీపీకి టఫ్ గా మారనున్నాయని అంటున్నారు. అవి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఆముదాలవలస, టెక్కలి, పాతపట్నం, ఎచ్చెర్ల ఉన్నాయి. విజయనగరంలో చూసుకుంటే బొబ్బిలి, ఎస్ కోట ఉన్నాయి. విశాఖపట్నం లో చూసుకుంటే భీమునిపట్నం, అనకాపల్లి, గాజువాక. పాయకరావుపేట వంటివి ఉన్నాయి.

ఇలా మొత్తంగా చూస్తే పది సీట్ల వరకూ వైసీపీకి ఉత్తరాంధ్రాలో టఫ్ గా ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ పది సీట్లలో కూటమికి కొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే ఈ పదిలో బాగా శ్రమించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇవి తీసి పక్కన పెడితే మిగిలిన ఇరవై నాలుగు సీట్లలోనే వైసీపీకి టీడీపీ కూటమికి ఢీ అంటే ఢీ పోటీ ఉంటుంది అని అంటున్నారు.

ఇందులో వైసీపీ సగానికి పైగా గెలుచుకున్నా ఓవరాల్ గా చూస్తే మాత్రం కూటమిదే మెజారిటీతో పాటు పై చేయిగా ఉంటుందని అంటున్నారు. మరి జగన్ బస్సు యాత్ర వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో తరువాత పరిస్థితులలో మార్పు ఏమైనా కనిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.