Begin typing your search above and press return to search.

వాలంటీర్లే సరిపోతారా ? మరి కేడరు?

వచ్చేఎన్నికల్లో వైసీపీని రెండోసారి వాలంటీర్లు మాత్రమే గెలిపిస్తారా ? ఇపుడు పార్టీలో జరుగుతున్న చర్చిదే

By:  Tupaki Desk   |   17 Nov 2023 2:30 PM GMT
వాలంటీర్లే సరిపోతారా ? మరి కేడరు?
X

వచ్చేఎన్నికల్లో వైసీపీని రెండోసారి వాలంటీర్లు మాత్రమే గెలిపిస్తారా ? ఇపుడు పార్టీలో జరుగుతున్న చర్చిదే. ఎందుకంటే పార్టీకి ఎంతో కీలకమైన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతల ప్రాధాన్యతనను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అధికాంలోకి రావాలన్నా, ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలన్నా ముందు ఉండాల్సింది క్యాడర్. క్యాడర్ను నడిపించే ద్వితీయశ్రేణి నేతలే.

ద్వితీయశ్రేణి నేతలు గట్టిగా పనిచేయంటపైనే ఎంఎల్ఏ అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడుంది. పోయిన ఎన్నికల్లో అనేక సమీకరణలు కలిసొచ్చి వైసీపీకి 151 మంది ఎంఎల్ఏలు గెలిచారు. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా అంతటి సీనుందా అన్నదే అనుమానం. అలాంటపుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమైన ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ను జగన్ ఎందుకు పట్టించుకోవట్లేదు ? ఇపుడీ ప్రశ్నే పార్టీలో బాగా చర్చనీయాంశమవుతోంది. పార్టీలో ఇంటర్నల్ టాక్ ఏమిటంటే జగన్ ఆలోచన, ఆశలన్నీ వాలంటీర్ల వ్యవస్ధ మీదే ఉందట.

ప్రభుత్వానికి, సంక్షేమ పథకాల లబ్దిదారులకు మధ్యలో వాలంటీర్ల వ్యవస్ధను జగన్ ఒక బ్రిడ్జిలాగ ఏర్పాటుచేశారు. పథకాల అమలు మొత్తాన్ని సుమారు 2.7 లక్షల వాలంటీర్లే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం లబ్దిదారులను ఈ 2.7 లక్షలమంది వాలంటీర్లే చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెబితే లబ్దిదారులు వైసీపీకి ఓట్లేస్తారనే భ్రమలో జగన్ ఉన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అవసరమైనపుడు వాలంటీర్ల సేవలను జనాలు వాడుకుంటారు కానీ వాళ్ళు చెప్పినట్లుగా ఓట్లు వేస్తారా అనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది.

జనాల్లో తిరగాల్సింది, ఎలక్షనీరంగ్ చేయాల్సింది, జనాలను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళాల్సింది ద్వితీయశ్రేణి నేతలు, క్యాడరే అన్న విషయం జగన్ కు తెలీదా లేకపోతే మరచిపోయారా అనే సందేహం పెరిగిపోతోంది. ఏదేమైనా వాలంటీర్ల వల్ల గట్టి నేతలు అనుకున్న వాళ్ళకి కూడా జనాలతో సంబంధాలు లేకుండాపోయాయట. ఎందుకంటే పథకాలు అందాల్సిన జనాలెవరు ఇపుడు ద్వితీయశ్రేణి నేతలు లేకపోతే ఎంఎల్ఏల దగ్గరకు వెళ్ళటం లేదు. అందుకనే వాలంటీర్లను తప్పించి పార్టీ నేతలకు జనాల్లో గుర్తింపులేకుండా పోయింది. మరీ విషయం పార్టీకి ఎంతమేర డ్యామేజి చేస్తుందో అన్న విషయం పార్టీకి అర్థం కావడం లేదు. దీని ప్రభావం ఎన్నికల్లోనే అర్ధమవుతోందేమో.