Begin typing your search above and press return to search.

వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు భారీ షాక్....?

దాంతో ఆయన ఎంపీ సీటుకు కొత్త వారికే చాన్స్ అన్నది ఎప్పటినుంచో నిర్ణయం అయిపోయిన మాట

By:  Tupaki Desk   |   21 Aug 2023 3:51 AM GMT
వైసీపీ సిట్టింగ్ ఎంపీలకు భారీ షాక్....?
X

వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీని బంపర్ మెజారిటీతో జనాలు గెలిపించారు. అయితే గెలిచిన ఆరు నెలలకు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు రెబెల్ గా మారిపోయారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన పంటిలో రాయిలో కంటిలో నలుసుగా వైసీపీ పెద్దలకు మారి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

దాంతో ఆయన ఎంపీ సీటుకు కొత్త వారికే చాన్స్ అన్నది ఎప్పటినుంచో నిర్ణయం అయిపోయిన మాట. మిగిలిన 21 మందిలో ఎంతమందికి తిరిగి టికెట్లు దక్కుతాయన్నది ఇపుడు చర్చగా ఉంది. ఎన్నికలు వస్తున్న వేళలో వైసీపీ ఎంపీలలో కొందరిని ఎమ్మెల్యేలుగా దింపుతారు అని ప్రచారంలో ఉంది. అదే విధంగా మరి కొందరిని ఎంపీలుగా పంపిస్తారు అని అంటున్నారు.

ఈ మార్పు చేర్పులతో పాటు మరికొందరికి టికెట్ ఏదీ ఇవ్వకుండా పక్కన పెడతారు అని కూడా గట్టిగా వినిపిస్తున్న మరో మాట. ఆ జాబితాను తీసుకుంటే చాలానే ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా నుంచి మొదలెడితే విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాల చంద్రశేఖర్ కి ఈసారి ఇస్తే ఎమ్మెల్యేగా చాన్స్ ఉండవచ్చు. అది కూడా సర్దుబాటు బట్టి. ఆయనకైతే మళ్ళీ ఎంపీ ఇవ్వరన్నది కన్ ఫర్మ్ అంటున్నారు.

విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ కట్ అని అంటున్నారు. ఆయన కూడా సరేనంటున్నారు అని టాక్. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి రెండు సీట్లు ఎంపిక చేసుకున్నారు. ఒకటి భీమిలీ, రెండు విశాఖ తూర్పు మరి అందులో ఏదైనా ఇచ్చి సర్దుబాటు చేస్తారేమో చూడాలి. లేకపోతే షాక్ తప్పదనే అంటున్నారు.

అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతికి కూడా ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఆమె ప్లేస్ లో భీమిలీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ని కానీ లేక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని కానీ నిలబెడతారు అని అంటున్నారు. ఇక సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అయితే అది దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కూడా ఈసారి టికెట్ దక్క్దని అంటున్నారు. ఆమె పాడేరు ఎమ్మెల్యే సీటు కోరుతున్నారు. మరి హై కమాండ్ ఆమెకు ఆ సీటు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పాడేరు ఎమ్మెల్యే సీటుకు భారీ పోటీ ఉంది మరి. సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మికి మాత్రం మరోసారి ఎమ్మెల్యే టికెట్ దక్కదనే అంటున్నారు.

రాజమండ్రీ ఎంపీ భరత్ కి ఎమ్మెల్యే సీటు ఇస్తారని టాక్. దాంతో ఎంపీ గా ఆయనకు టికెట్ దక్కదనే అంటున్నరు. ఇక అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనూరాధకు ఈసారి టికెట్ కష్టమనే అంటున్నారు. ఆమె అమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మరి దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. దాంతో ఎంపీగా ఆమెకు టికెట్ ఇవ్వరని అనుకుంటున్నారు.

ఏలూరు ఎంపీ శ్రీధర్ కి మళ్లీ టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చూస్తున్నారు. కానీ దక్కితే లక్కే అని అంటున్నారు. బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ కి ఈసారి టికెట్ దక్కదు అని ప్రచారంలో ఉంది. మరి ఆయనను ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దింపుతారో చూడాల్సి ఉంది. నరసారవుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలుకు టికెట్ దక్కదనే అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా వేరే ఆలోచనలు ఉన్నాయా అన్నది ప్రస్తుతానికి తెలియదు అంటున్నారు.

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఆ సీటు దక్కకపోవచ్చు అన్నది ఒక టాక్ గా ఉంది. ఆయన గుంటూరు అడుగుతున్నారని అంటున్నారు. సో ఇస్తారా లేదా అన్నది చూడాలి. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. సో ఇక్కడ నుంచి కొత్త వారికే చాన్స్ అని అంటున్నారు. ఒంగోలు నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ ప్లేస్ లో బిగ్ షాట్స్ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

తిరుపతి టికెట్ మాత్రం బై పోల్ లో గెలిచిన గురుమూర్తికి టికెట్ మళ్ళీ ఇవ్వవచ్చు. ఇక చిత్తూరు ఎంపీకి మాత్రం భారీ షాక్ తప్పదని అంటున్నారు. అలాగే నంద్యాల, కర్నూల్ ఎంపీ అభ్యర్ధులకు చెక్ పెడతారు అని అంటున్నారు. ఇదే వరసలో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించుతారు కాబట్టి కొత్త వారిని తీసుకుంటారు అని అంటున్నారు.

కడప ఎంపీ టికెట్ ని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇస్తారా లేదా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కి షాక్ ఇస్తారని అంటున్నారు. ఆ సీటు నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణను పోటీకి దించుతారని అంటున్నారు. అనంతపురం ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని పంపుతారని అంటున్నరు. సో అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎంపీ రంగయ్యకు షాకే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఒకరిద్దరు తప్ప టోటల్ గా చేంజ్ చేసి కొత్త ముఖాలనే ఈసారి ఎంపీ అభ్యర్ధులుగా వైసీపీ బరిలోకి దించబోతోంది అని అంటున్నారు.