Begin typing your search above and press return to search.

వైసీపీపై విలేజ్ లెవ‌ల్లో ఫీడ్‌బ్యాక్ ఇదే...!

వీటితోపాటు.. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం. కానీ, పైకి మా త్రం ఎక్క‌డా ఆర్భాట‌పు ప్ర‌క‌ట‌న‌లు లేవు

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:53 AM GMT
వైసీపీపై  విలేజ్ లెవ‌ల్లో  ఫీడ్‌బ్యాక్ ఇదే...!
X

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. ఏపీ అధికార పార్టీ వైసీపీ క్షేత్ర‌స్థాయిలో దూకుడు పెంచింది. పైకిమాత్రం సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో ముఖ్యంగా గ్రామీణ లెవిల్లో .. వైసీపీ మాట జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రైతులు, అసైన్డ్ భూముల వివాదాలు ఉన్న‌వారికి తాజాగా స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం మేలుచేయ‌డం. అదేస‌మ‌యంలో వ‌రిక‌పూడిశెల వంటి కీల‌క‌మైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట‌డం.

వీటితోపాటు.. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం. కానీ, పైకి మా త్రం ఎక్క‌డా ఆర్భాట‌పు ప్ర‌క‌ట‌న‌లు లేవు. ఎవ‌రూ మాట్లాడ‌రు. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌నులు చాలా వేగంగా జ‌రుగుతున్నాయి. వీటి ఫ‌లితాలు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో వైసీపీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కొంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్నా.. గ్రామాల్లో మాత్రం వైసీపీకి సానుకూలంగా ఓటు బ్యాంకు ఉండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి అసైన్డ్ భూముల వ్య‌వ‌హారానికి, అదేస‌మ‌యంలో బ్రిటీష్ కాలం నాటి చుక్క‌ల భూముల వ్య‌వ‌హా రానికి కూడా వైసీపీ ప్ర‌భుత్వం ప‌రిష్కారం చూపించింది. ఇది ఒక‌ర‌కంగా.. గ్రామీణ ప్రాంత రైతాంగానికి మేలి మ‌లుపు. అదేస‌మ‌యంలో వ‌రిక‌పూడిశెల అనేది కూడా ఎన్నో ద‌శాబ్దాలుగా క‌ల‌గా మారిపోయింది. అయితే.. గ‌తంలో ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే ముఖ్య‌మంత్రులు శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ ద‌ఫామాత్రం అట‌వీ శాఖ నుంచి అనుమ‌తులు తెచ్చిన త‌ర్వాతే జ‌గ‌న్ రంగంలోకి దిగారు.

ఇది స్థానికంగా వైసీపీకి ప్ల‌స్‌గా మారింది. అనుమ‌తులు వ‌చ్చాయి.. బ‌డ్జెట్ కూడా కేటాయించ‌డంతో ప‌నులు జ‌రుగుతాయ‌ని ప‌ల్నాడు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇదొక్క‌టే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ వ‌రిక‌పూడిశెల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలా.. కీల‌క‌మైన భూములు-నీళ్ల వ్య‌వ‌హారం.. వైసీపీకి విలేజ్ స్థాయిలో మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలుచెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇంకో ఒక‌టి రెండు ప‌థ‌కాలు చేయాల్సి ఉంద‌ని ఆత‌ర్వాత ఈ రేంజ్ పెరుగుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.