Begin typing your search above and press return to search.

వైసీపీ లిస్ట్ మీద ఉత్కంఠ... జాతకాలు తేల్చుడే...!?

ఇపుడు ఫైనల్ లిస్ట్ రిలీజ్ అవుతోంది. అందులో మిగిలిన వారందరికీ సీట్లు గ్యారంటీయా అన్నది కూడా చర్చకు వస్తోంది

By:  Tupaki Desk   |   16 March 2024 12:30 AM GMT
వైసీపీ లిస్ట్ మీద ఉత్కంఠ... జాతకాలు తేల్చుడే...!?
X

వైసీపీ తన సెంటిమెంట్ ప్రకారం కడప జిల్లా ఇపుడుపుల పాయలో వైఎస్సార్ సమాధి నుంచి వైసీపీ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు, 25 ఎంపీ అభ్యర్ధుల జాబితాను ఒకే సారి విడుదల చేయనున్నారు. దీని కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. జగన్ ఇప్పటికే 90 మంది దాకా అసెంబ్లీ ఇంచార్జిలను నియమించారు. అలాగే 17 మంది దాకా ఎంపీ సీట్లలో ఇంచార్జిలను కొత్తగా తెచ్చారు.

ఇపుడు ఫైనల్ లిస్ట్ రిలీజ్ అవుతోంది. అందులో మిగిలిన వారందరికీ సీట్లు గ్యారంటీయా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఒకవేళ కాకుంటే వారి ప్లేస్ లో ఎవరికి ఇస్తారు అన్నది కూడా మరో చర్చ. ఉత్తరాంధ్రా నుంచి చూసుకుంటే రాయలసీమ దాకా చాలా సిట్టింగ్ సీట్లలో కొందరు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని అంటున్నారు.

అలా చూస్తే శ్రీకాకుళం నుంచి ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పాతపట్నంలో రెడ్డి శాంతి, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, విజయనగరంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు, విశాఖ జిల్లాలో పెందుర్తి నుంచి అదీప్ రాజ్, భీమిలీ నుంచి అవంతి శ్రీనివాసరావులకు సీట్లు ఇస్తారా అన్నది చర్చగా ఉంది.

అదే విధంగా చూస్తే రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే మంత్రి ఆర్ కే రోజా, గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు వంటి వారి సీట్లు సేఫ్ గా ఉంటాయా అన్నది కూడా వారి అనుచరులలో ఎడతెగని చర్చగా ఉంది. శ్రీకాకుళం ఎంపీగా పేడాడ తిలక్ ని ఉంచుతారా లేక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కానీ వేరెవరికైనా టికెట్ ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.

అనకాపల్లి ఎంపీ సీటు సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతికే ఇస్తారా లేక కొత్త ముఖానికి చాన్స్ ఇస్తారా అన్నది కూడా తేల్చలేదు. అదే విధంగా పలు కీలక ఎంపీ సీట్లలో కూడా అభ్యర్థుల మార్పుచేర్పులు ఉంటాయా అన్నది కూదా చర్చగా సాగుతోంది.

మొత్తం మీద ఈ నెల 16న రాజకీయ సునామీ అని వైసీపీ అంటోంది. అది నిజమే అని చెప్పేలా పరిణామాలు ఉండబోతున్నాయి. వైసీపీ టోటల్ లిస్ట్ ని ఒక వైపు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతోంది. అలాగే అదే రోజున కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించనుంది. మొత్తం మీద ఇప్పటిదాకా ఒక ఎత్తు ఈ నెల 16వ తదీ నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉండబోతోంది. మరి కొద్ది గంటలలో ఏపీలో రాజకీయ వేడి ఉవ్వెత్తున ఎగిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.