Begin typing your search above and press return to search.

విశాఖ వైసీపీ రిపేర్లకు ఆయన వచ్చారు !

వైసీపీ 2019లో ప్రభంజనం సృష్టించినా విశాఖ సిటీలో మాత్రం ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. నాలుగు దిక్కులూ సైకిల్ పార్టీకే జై కొట్టాయి.

By:  Tupaki Desk   |   19 May 2025 10:00 AM IST
విశాఖ వైసీపీ రిపేర్లకు ఆయన వచ్చారు !
X

వైసీపీ 2019లో ప్రభంజనం సృష్టించినా విశాఖ సిటీలో మాత్రం ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. నాలుగు దిక్కులూ సైకిల్ పార్టీకే జై కొట్టాయి. ఇక 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కూడా వైసీపీ బొటా బొటీ మెజారిటీనే సాధించింది. 30కి పైగా కార్పొరేషన్ వార్డులను టీడీపీ గెలుచుకుంది అంటే ఆ పార్టీ సత్తా ఏమిటో అర్ధమవుతోంది అని అంటున్నారు.

ఈ నేఅధ్యంలో వైసీపీని విశాఖలో గాడిలో పెట్టడం ఎలా అన్న దాని మీద అధినాయకత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. విజయసాయిరెడ్డి ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డికి రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు ఇస్తే ఆయన హయాంలో వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీతో మొదలెట్టి సార్వత్రిక ఎన్నికల దాకా ఓటమి బాటనే పట్టింది.

ఇక రీజనల్ కో ఆర్డినేటర్ గా కాకినాడ జిల్లాకు చెందిన కురసాల కన్నబాబుకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రాతో పాటు విశాఖలో ఓసీ కాపులు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో సామాజిక కోణంలో ఆయన నియామకం జరిగింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీసీ నేత ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబూరావుని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులుగా ఇటీవల వైసీపీ అధినాయకత్వం నియమించింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 2014లో ఆయన కనిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ 2019 తరువాత వైసీపీలో చేరారు.

ఇక ఆయన సేవలను విశాఖలో ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ ని చేసిన అధినాయకత్వం బాబూరావుని విశాఖ పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడుగా చేసింది. ఆయన తాజాగా విశాఖకు వచ్చారు. పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు.

వైసీపీని విశాఖలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అన్ని వర్గాలను పార్టీకి దగ్గర చేస్తామని అన్నారు. ఇక చూస్తే పార్టీలో నాయకులకు కొదవ లేదని అంటున్నారు. మొదటి నుంచి వైసీపీలో నాయకులు ఎక్కువగానే ఉన్నారు అయితే కో ఆర్డినేషన్ లోపంగా ఉంది అని అంటున్నారు.

కాకినాడకు చెందిన కురసాల కన్నబాబు ప్రకాశం జిల్లాకు చెందిన బాబూరావు ఇద్దరూ కలసి విశాఖలో పార్టీని పటిష్టం చేయాలీ అంటే ముందు సీనియర్లను అందరినీ కలుపుకుని పోవాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు వైసీపీ క్యాడర్ లో నిస్తేజం పోగొట్టాలని అంటున్నారు. విశాఖలో కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి.

వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీని బలోపేతం చేయకపోతే ఢీ కొట్టడం కష్టమని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీఎపీలో అనేక రిపేర్లు చేయాల్సి ఉందని అంటున్నారు. మరి ఆ రిపేర్లకు బాబూరావు హ్యాండ్ ఎంతవరకూ కలసి వస్తుందో ఆయన లక్కీ హ్యాండ్ అవుతారా లేదా అన్నది తొందర్లో చూడాల్సి ఉందని పార్టీలో అంటున్నారు.