Begin typing your search above and press return to search.

వెన్నుపోటు...వైసీపీ నేతల సైలెన్స్ పోటు !

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. పైగా కేసులు భయం కూడా ఉంది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 11:00 PM IST
వెన్నుపోటు...వైసీపీ నేతల సైలెన్స్ పోటు !
X

వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ అధినాయకత్వం ఏడాది కూటమి పాలన మీద శర సంధానం చేసింది. ఏడాదిలో ఏమి జరిగినా ఈ ఒక్క భారీ ఆందోళనతో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పొలిటికల్ గా మంచి మైలేజ్ సాధించాలని వైసీపీ చేసిన ఈ ప్రయత్నం పాక్షికంగానే సక్సెస్ అయింది అని అంటున్నారు.

దానికి కారణం వైసీపీలోనే నేతలు గుమ్మం దాటి కదలకపోవడం అని అంటున్నారు. అంతే కాదు చాలా మంది నేతలు ఇలా వచ్చి అలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి తప్పుకున్నారని అంటున్నారు. సీనియర్ నేతలు ఎంతో మంది ఇంకా సైలెంట్ మోడ్ నుంచి బయటకు రావడం లేదని కూడా వెన్నుపోటు దినం ఎపిసోడ్ కళ్ళకు కట్టినట్లు చూపించింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక చాలా మంది నేతలు ఈ రోజుకీ బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. పైగా కేసులు భయం కూడా ఉంది. దాంతో ఎందుకొచ్చిన తంటా అని నేతలు మౌన ముద్ర దాలుస్తున్నారు అని అంటున్నారు.

పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని కూడా చాలా మంది నేతలు అందుకే డుమ్మా కొట్టారు అని అంటున్నారు. ఇక ఏడాది వైసీపీ విపక్ష పాత్రలో పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ జనంతో ఉండే వారు పార్టీ కార్యక్రమాలను తుచ తప్పకుండా ఫాలో అవుతున్న వారి వివరాలు చూస్తే కనుక మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాతిక నుంచి ముప్పై లోపుగానే ఉంది అని అంటున్నారు

అంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరవ వంతు మాత్రమే రియాక్టు అవుతున్నారని అంటున్నారు. మెజారిటీ నాయకులు ఎందుకో చురుకుదనం చూపించడం లేదు అని అంటున్నారు. ఇక తాజాగా వెన్నుపోటు దినం పేరుతో పార్టీ పిలుపు ఇస్తే దానికి కూడా ఇదే మాదిరి స్పందన సొంత పార్టీ నేతల నుంచి వచ్చిందని అంటున్నారు.

ఇక వెన్ను పోటు దినం కార్యక్రమంలో ఎక్కడ నుంచి ఎవరెవరు చురుకుగా పాల్గొన్నారు అన్న దాని మీద వైసీపీ అధినాయకత్వం తాజాగా నివేదికలు రప్పించుకుంది అని అంటున్నారు. అలా వచ్చిన నివేదికలు చూస్తే కనుక ఏకంగా హై కమాండ్ కే షాక్ ఇచ్చేలా సీన్ ఉందిట. చాలా మంది నాయకులు అయితే వెన్నుపోటు దినాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని మమ అనిపించారని నివేదికలు చెబుతున్నాయట.

పార్టీ కోసం గట్టిగా పనిచేయకుండా ఉంటే ఎలా అన్నదే ఇపుడు అధినాయకత్వానికి పట్టుకున్న చింత అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా నాయకులు ఉండడం ఏ కార్యక్రమం ఇచ్చినా తూతూ మంత్రంగా చేయడం పట్ల అధినాయకత్వం అయితే సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. ప్రజలలో ఏడాది పాలనకే టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చిందని ఈ అవకాశాన్ని వాడుకుని తమ ప్రాంతాలలో పార్టీని పటిష్టం చేయడం జనాల సమస్యల మీద పోరాడడం వంటివి చేయకపోతే ఎలా అన్నదే హై కమాండ్ కి పట్టుకుంది అని అంటున్నారు.

చాలా చోట్ల పార్టీ పదవులు ఇచ్చినా కూడా వాటిని అలంకార ప్రాయంగానే భావిస్తున్నారు అని అంటున్నారు. రెండు విడతలలో నలభై మందికి పైగా మంత్రులు పనిచేస్తే అరడజన్ మించి ఈ రోజు పార్టీలో క్రియాశీలంగా ఉన్న వారు కనిపించడం లేదు అని అంటున్నారు. అలాగే నియోజకవర్గాల ఇంచార్జి పదవులు కట్టబెట్టినా కొందరు పార్టీ పట్ల పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం కూడా హై కమాండ్ దృష్టికి వచ్చిందని అంటున్నారు. దాంతో వైసీపీకి సరికొత్త మరమ్మతులు చేయడానికి అధినాయకత్వం చూస్తోందా అన్న చర్చ మొదలైంది.

అవసరం అయితే పార్టీకి పనిచేయని వారిని పక్కన పెట్టి చురుకుగా ఉండే వారికే పదవులు ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే ఇక నుంచి కూటమి మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తోంది. దీంతో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తారా అన్నదే చర్చగా ఉంది.