Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్...జగన్ అలా కేసీఆర్ ఇలా !

ప్రస్తుతం దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ మీద రాజకీయ చర్చ సాగుతోంది. అధికార ఎన్డీయే తీసుకున్న విధానం పట్ల ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Satya P   |   16 April 2026 9:11 AM IST
డీలిమిటేషన్...జగన్ అలా కేసీఆర్ ఇలా !
X

ప్రస్తుతం దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ మీద రాజకీయ చర్చ సాగుతోంది. అధికార ఎన్డీయే తీసుకున్న విధానం పట్ల ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు అయితే తమ సీట్లు పెద్ద ఎత్తున తగ్గి రాజకీయంగా అభివృద్ధి పరంగా ఇబ్బంది అవుతుందని కూడా ఆందోళన చెందుతున్నాయి. దక్షిణాదిలోనే ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఇందులో ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే లాంటివి పూర్తిగా యాంటీ స్టాండ్ తీసుకుంటే అన్నా డీఎంకే జేడీఎస్, టీడీపీ జనసేన వంటివి జై కొడుతున్నాయి. అయితే చిత్రంగా తటస్థంగా ఉన్న వైసీపీ మాత్రం డీలిమిటేషన్ మీద కేంద్రం అనుసరిస్తున్న విధానానికి అనుకూలంగా స్పందిస్తోంది. అదే సమయంలో తెలంగాణాలో ఉన్న మరో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అయితే బిల్లు స్వరూప స్వభావాలను చూసి మాత్రమే ఏ సంగతీ చెబుతామని అంటోంది.

వైసీపీకి ఓకే :

దేశంలో కొత్తగా సీట్లు పెరిగితే మంచిదే కదా ఎంత మంది యువతకు కొత్త వారికి అవకాశాలు వస్తాయని వైసీపీ అంటోంది. అంతే కాదు చిన్న నియోజకవర్గాల వల్ల అభివృద్ధి కూడా సాగుతుందని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల పునర్ విభజన చేసే విధానం పట్ల సంతృప్తిగా ఉన్నామని ఆ పార్టీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించడం విశేషం. నిజం చెప్పాలీ అంటే ప్రాంతీయ పార్టీల పట్టుని దెబ్బ తీసే విధంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండబోతోంది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. స్టాలిన్ విజయ్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తూ వైసీపీ ఓకే చెప్పడమే అసలైన ట్విస్ట్

కేసీఆర్ ఆచీ తూచీ :

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే డీలిమిటేషన్ మీద ఆచీ తూచీ స్పందించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించిన బీఆర్ఎస్ డీలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించడం విశేషం. డీలిమిటేషన్ బిల్లులో పేర్కొన్న అంశాలు అన్నీ చూసిన మీదటనే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని కేసేఅర్ చెప్పడం విశేషం.

సహేతుకంగా డిమాండ్ :

ఇదిలా ఉంటే ప్రస్తుతం 543 ఎంపీలు దేశంలో ఉంటే సౌత్ స్టేట్స్ నుంచి 24 శాతం మంది ఎంపీల ప్రాతినిధ్యం ఉంది. ఆ శాతం తగ్గకుండా 50 శాతం సీట్లు పెంచాలని బీఆర్ఎస్ కోరుతోంది. అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ ఎస్ అంటోంది. మొత్తం మీద డీలిమిటేషన్ విషయంలో బీఆర్ ఎస్ నిర్మాణాత్మకంగానే వ్యవహరించాలని చూస్తోంది. అలాగే ప్రాంతీయ పరమైన అవసరాలను పరిగణనలోకి తీసుకుంటోంది. వైసీపీ మాత్రం ఎన్డీయేకు ఔట్ రేట్ గా మద్దతు ఇవ్వడమే చర్చనీయాంశంగా ఉంది.