Begin typing your search above and press return to search.

వైసీపీ సోలో : మిత్రులు లేరా... వద్దా ?

వైసీపీ పుట్టాక మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది ఒకటి విజయం సాధించింది. అయితే ఇవన్నీ సోలోగానే.

By:  Tupaki Desk   |   6 April 2025 5:00 PM IST
వైసీపీ సోలో : మిత్రులు లేరా... వద్దా ?
X

రాజకీయం అంటేనే మందితో పని. కలసి సాగడం. నంబర్ పెంచుకోవడం. ప్రజాస్వామ్యంలో నంబర్ కి ఉన్న విలువ దేనికీ లేదు. ఈ విషయం బాగా తెలిసి నంబర్ గేం లో తలపండిన వారు చంద్రబాబు అయితే ఆయనకు పూర్తి ఆపోజిట్ గా జగన్ ఉంటారు. తాను సింగిల్ అంటారు. సోలోగానే సో బెటర్ అంటారు.

వైసీపీ పుట్టాక మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది ఒకటి విజయం సాధించింది. అయితే ఇవన్నీ సోలోగానే. అంతా జగన్ క్రెడిట్ లోనే. ఓటమి కూడా ఆయనే తీసుకోవాలి అన్నది కూడా ఉంది. అయితే రాజకీయాలు ఒకప్పటిలా లేవు కాంగ్రెస్ పార్టీ ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఒంటి చేత్తో పాలించింది. ఎంతో సాధించింది కానీ ఈ రోజుకు చూస్తే కాంగ్రెస్ ఒంటరి పోరు అంటే ఆలోచిస్తుంది.

తనకు నచ్చినా కాకపోయినా అందరితో కలసి వెళ్తోంది. అన్నీ పంచుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అలా కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోంది. దీని ఫలితాలు ఏదో నాటికి అయితే వస్తాయని బలంగా నమ్ముతోంది. ఇక ప్రాంతీయ పార్టీలలో బలంగా ఉన్న తమిళనాడులోని డీఎంకే సైతం పొత్తులు కడుతోంది.

అలాగే తెలంగాణాలో బీఆర్ఎస్ కొంతకాలం లెఫ్ట్ పార్టీలతో దోస్తీ నెరపింది. ఉద్యమ కాలంలో అయితే ఎందరితోనో కలిసి కూడింది 2009 ఎన్నికల్లో టీడీపీతో 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ఎదిగింది. ఇక ఏపీలో చూస్తే జనసేన మొదటి నుంచి పొత్తులతోనే వస్తోంది. తెలుగుదేశం గురించి చెప్పాల్సింది వేరేగా లేదు పొత్తులకే కొత్త భాష్యం చెబుతూ ఎప్పటికప్పడు ఎదుగుతూ వస్తోంది. పొత్తుల వల్ల అత్యధికంగా లాభపడిన పార్టీగా కూడా టీడీపీకి పేరుంది.

మరి రాజకీయం ఇంతలా విపులంగా గతాన్ని వర్తమానాన్ని విడమరచి చెబుతూంటే వైసీపీ మాత్రం సోలో గీతాలన ఆలపిస్తోంది. ఒంటరి పోరుకే రెడీ అంటోంది ఆ పార్టీ నాయకులు అదే మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏకంగా టీడీపీ కూటమిలో కలిపేయడం ద్వారా అంబటి రాంబాబు తమకు ఎప్పటికీ ఇండియా కూటమి వైపు వెళ్ళే ఉద్దేశ్యమే లేదని చెప్పేశారు.

అలాగే ఏపీలో వామపక్షాల విషయం కూడా వైసీపీ పట్టించుకోవడం లేదు ఇప్పటిదాకా పార్టీ ఒంటరిగానే ఆందోళనలు చేసింది. ఫ్యూఅర్ లో కూడా అదే రకమైన ఆలోచనలో ఉంది. నిజానికి చూస్తే ఏపీలో వామపక్షాలను కలుపుకుని పోతే వైసీపీకి బెటర్ అన్నది ఉంది. వారికి బలం త్గక్కువగా ఉన్నా సిద్ధాంత బలం ఎక్కువ.

పైగా వారు ఉద్యమాలు చేస్తే అవి జనమలోకి బాగా వెళ్తాయి. వారి దన్ను ఉంటే వైసీపీ నిరసనలూ హైలెట్ అవుతాయి. కార్మిక వర్గాలలో బలమైన సంఘాలు వారికి ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో కనీసంగా రెండు వేల ఓట్ల దాకా వామపక్షాలకు ఉంది అని ఒక లెక్క చెబుతారు.

మరి ఢీ అంటే ఢీ కొడుతున్న ఏపీ రాజకీయాల్లో ప్రతీ ఒక్క ఓటీ కీలకమే అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆ విధంగా చూసుకుంటే కనుక కామ్రేడ్స్ లో చెలిమి వైసీపీకి మేలు అని అంటున్నారు. వారు చాలా వేగంగా జనాల ఒపీనియన్ ని చేంజ్ చేయగలరు అని అంటారు. వైసీపీ తానుగా విమర్శించే జనాలలో వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అదే కామ్రేడ్స్ చేసే విమర్శలకు ఒక విలువ గౌరవం ఉంటాయని అంటున్నారు.

అయితే వైసీపీ ఆలోచనలు మాత్రం ఒంటరి పోరుకే సై అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. మరో నాలుగేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. ఇంకా చాలా దూరం ఉంది. ఈ మధ్యలో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అన్నది తెలియదు కానీ వైసీపీ అధినాయకత్వం ధోరణి చూస్తే కనుక ఒంటరి పోరుకే రెడీ అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు. వామపక్షాలు కూడా వైసీపీ ఫిలాసఫీ తెలుసు కాబట్టి ఆ వైపుగా ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు అని కూడా అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలతో బలంగా ఉన్న ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఒంటరి పోరు ఆ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుంది. ఏ తీరం చేరుస్తుంది అన్నది అయితే వేచి చూడాల్సిందే మరి.