Begin typing your search above and press return to search.

వారసులకు జగన్ మార్క్ షాక్ ?

వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా. 2024 ఎన్నికల్లో చాలా మందికి టికెట్లు ఇచ్చేశారు జగన్. అంతా తన బొమ్మతో గెలిచి వస్తారని అతి ధీమాకు వెళ్ళిన కారణంగా అలా చేశారు అని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 10:00 AM IST
వారసులకు జగన్ మార్క్ షాక్ ?
X

వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా. 2024 ఎన్నికల్లో చాలా మందికి టికెట్లు ఇచ్చేశారు జగన్. అంతా తన బొమ్మతో గెలిచి వస్తారని అతి ధీమాకు వెళ్ళిన కారణంగా అలా చేశారు అని అనుకున్నారు. అంతే కాదు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేసింది కాబట్టి పక్కాగా గెలిచి తీరుతామని అనుకున్నారు. అందుకే వైనాట్ 175 అని కూడా గట్టిగా సౌండ్ చేశారు.

తీరా చూస్తే ఫలితాలు తేడా కొట్టాయి. ఇలా అలా కాదు ఏకంగా 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయేలా దారుణమైన రిజల్ట్ ని చవిచూడాల్సి వచ్చింది. ఇక కూటమి పాలనకు ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో జగన్ స్పీడ్ పెంచారు. పార్టీ సమావేశాలను తరచూ నిర్వహిస్తున్నారు. అంతే కాదు తాను కూడా వీలైనపుడల్లా జిల్లా టూర్లు వేస్తున్నారు.

మధ్యలో ఆందోళన కార్యక్రమాలను వివిధ అంశాలకు సంబంధించి నిర్వహిస్తున్నరు. ఇలా బహుముఖ వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అధినాయకత్వం కొన్ని కీలక విషయాలలో తనదైన నిర్ణయాలను తీసుకుంటోంది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి అన్నది తెలిసిందే. ఈసారి పక్కాగా అధికారంలోకి వచ్చి తీరాల్సిందే. ఏ మాత్రం బెడిసినా వైసీపీ ఉనికికే ముప్పు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. దాంతో జగన్ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సీనియర్లకు సమర్ధులకు పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని ఇప్పటి నుంచే డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో ప్రయోగాలకు నో చాన్స్ అని అంటున్నారు. వైసీపీలో చూస్తే 2024 ఎన్నికల్లో కొంతమంది వారసులకు టికెట్లు దక్కాయి. అలా మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, తురుపతి నుంచి భూమా అభినయ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వంటి వారు వారసుల కోటాలో టికెట్లు పొందారు అయితే ఈసారి వారసులకు నో టికెట్స్ అని వైసీపీ చెప్పబోతోంది అని అంటున్నారు.

వైసీపీ తరఫున సీనియర్లే పోటీలో ఉండాలని కోరుతోంది. వారు ఉంటేనే అసలైన పోటీ కనిపిస్తుందని కూటమిని ధీటుగా ఎదుర్కోగలుగుతారని అంటున్నారు. అంతే కాదు ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలలో తిరిగి తండ్రులే ఆ సీట్లలో పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పర్యవేక్షించాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక గత ఎన్నికల్లో చాలా మంది తాము బరిలో నుంచి తప్పుకుంటామని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరారు. అలా ఈసారి పరిస్థితి ఉండదని అంటున్నారు. పనిచేసే వారికి కష్టకాలంలో అండగా ఉండేవారికి కేసులకు భయపడకుండా జనంలో ఉంటూ పార్టీని నిలబెట్టే వారికే టికెట్లు ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీలో చాలా మార్పులు వస్తున్నాయని అంటున్నారు.