సామాజిక వర్గాలపై.. కూటమి వ్యూహం.. జగన్‌కు చెక్ ..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి.. కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది.
By: Tupaki Desk | 13 April 2025 5:00 PM ISTవచ్చే ఎన్నికలకు సంబంధించి.. కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన పోటీ దారుగా .. జనసేన నిలబడేలా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక, బీసీలను చంద్రబాబు, టీడీపీ దరి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక, మైనారిటీలు మాత్రమే.. జగన్ వైపు ఉన్నట్టు కనిపిస్తున్నా.. అది ఎంత వరకు అనేది చెప్పడం కష్టంగానే మారింది. ఇలాంటి సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది.
వాస్తవానికి ఆది నుంచి కూడా.. వైసీపీకి ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు.. చేరువ అయ్యారు. కాంగ్రెస్ కు అను కూలంగా ఉన్న ఆయా వర్గాలను.. వైసీపీ తనవైపు తిప్పుకొని.. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కాపాడు కుంది. తాజా ఎన్నికల్లోనూ కూటమి హవాతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టును నిలబెట్టుకుంది. అయితే.. దీనిపై కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీనిలో భాగంగానే ఎస్సీ, ఎస్టీలను తనవైపు తిప్పుకొనేందుకు జనసేన చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఎస్సీల నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. ఇక, బీసీల విషయానికి వస్తే.. చంద్రబాబు వీరిని మరింత అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. బీసీలకు పెద్ద పీట వేస్తున్నా మని.. పదవులు.. పథకాలు కూడా.. వారికి చేరువ చేస్తున్నామని చెబుతున్నారు. బీసీలు ఎక్కువ గా ఉన్న నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలను మరింత ఎక్కువగా ఇస్తామని కూడాచెబుతున్నారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుపై జనసేన, బీసీ ఓటు బ్యాంకుపై టీడీపీ పట్టు పెంచుకుంటున్నాయి.
హిందూ ఓటర్లు.. ఎలానూ.. బీజేపీ లేదా.. జనసేన వైపు మొగ్గు చూపడం ఖాయమనిచర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో జగన్ కూడా వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేయకపోతే.. భవిష్యత్తు మరింత ఇబ్బంది అవుతుంది. దీనిని గమనించినజగన్.. గతంలో తాను చేసిన పాలనను, ఇచ్చిన పదవులను ఇప్పుడు గుర్తు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆయన.. పార్టీ నాయకులు.. వైసీపీ పాలనను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. మరి ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
