Begin typing your search above and press return to search.

వాళ్ల‌ని ఆరు నెల‌ల్లో జైల్లో పెడ‌తాం: వైసీపీ

రాష్ట్రంలో ``రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో` కార్య‌క్ర‌మాన్ని మాజీ సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Jun 2025 9:05 AM IST
వాళ్ల‌ని ఆరు నెల‌ల్లో జైల్లో పెడ‌తాం: వైసీపీ
X

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ఈ మాట అన్న‌ది వైసీపీనే. అందునా.. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న నాయ‌కుడు, రాష్ట్ర వైసీపీ కో ఆర్డినేట‌ర్‌.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డే ఈ వ్యాఖ్య‌లు చేశారు. ``వాళ్ల‌ను ఆరు నెల‌ల్లో జైల్లో పెడ తాం. `` అని ఆయ‌న భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ భ‌య ప‌డ వ‌ద్ద‌న్న స‌జ్జ‌ల‌.. తాము అధికారంలోకి వ‌చ్చిన ఆరు మాసాల్లోనే టీడీపీ కీల‌క నాయ‌కుల‌ను, వైసీపీనాయ‌కుల‌ను వేధించిన వారిని.. ఆరు మాసాల్లోనే జైల్లోకి నెడ‌తామ‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. ఇదేస‌మ‌యంలో టీడీపీని కూడా హెచ్చ‌రించారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో ``రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో` కార్య‌క్ర‌మాన్ని మాజీ సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. అక్క‌డ కొత్త‌గా కార్యాల‌యం ప్రారంభిం చారు. అనంతరం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ధైర్యం చెబుతూ.. రాష్ట్రం లో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను కొట్టిన‌వారిని..కేసులు పెట్టిన వారిని కూడా .. వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. ఈ మాట జ‌గ‌నే చెప్ప‌మ‌న్నార‌ని చెప్పారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఇచ్చిన టాస్క్‌(రాష్ట్రంలో ``రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో` కార్య‌క్ర‌మం) విజ‌య వంతం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

అంతేకాదు.. నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ రెచ్చిపోతున్నాడ‌ని.. ఆయ‌న ఉడ‌త ఊపుల‌కుఎవ‌రూ బ‌య ప‌డ‌బోర‌ని చెప్పారు. ఎన్ని రెడ్‌బుక్‌లు ఉన్నా.. జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌ర‌ని.. ఆయ‌న సైన్యం కూడా భ‌య‌ప‌డ‌ద‌ని అన్నారు. పోలీసుల‌కు సీఎం చంద్ర‌బాబు వైర‌స్ సోకింద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టు చేస్తున్నార‌ని అన్న స‌జ్జ‌ల‌.. వారిని కూడా బెదిరించారు. ఇప్పుడు మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తే.. మేం వ‌చ్చాక‌.. దాని తాలూకు ఫ‌లితం అనుభ‌విస్తార‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఎక్క‌డున్నా ఎవ‌రినీ వ‌దిలి పెట్టేది లేదన్నారు.

ఇక‌, రెంట‌పాళ్ల సింగ‌య్య మృతి కేసులో రోజు కో నాటకం ఆడుతున్నార‌ని స‌జ్జ‌ల దుయ్య‌బ‌ట్టారు. ఈ కేసులో జ‌గ‌న్‌ను అన‌వ‌స‌రంగా ఇరికించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా.. జ‌గ‌న్ పిలుపునిచ్చినా.. రాష్ట్రంలో ``రీకాల్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో` కార్య‌క్ర‌మానికి పెద్దగా స్పంద‌న రాలేదు. నాయ‌కులు క‌దిలితే.. కార్య‌క‌ర్త‌లు లేరు. కొన్ని చోట్ల ఇద్ద‌రూ క‌నిపించ‌లేదు. ఈ ప‌రిణామాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే.. సజ్జ‌ల వారిలో ధైర్యం నింపేందుకు.. ఇలా ఆరు నెల‌ల్లోనే జైల్లో పెడ‌తామంటూ.. హెచ్చ‌రిక‌లు చేశార‌న్న వాద‌నా పార్టీలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.