Begin typing your search above and press return to search.

సజ్జల మళ్ళీ సజ్జలే !

అయితే పార్టీ నిర్వహణ అన్నది అతి పెద్ద బాధ్యత. దానికి సజ్జలకు వేరే ఆల్టర్నేషన్ వేరే లేకుండా పోయింది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 8:00 AM IST
సజ్జల మళ్ళీ సజ్జలే !
X

వైసీపీలో కోటరీ అని బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి ఎంతగానో చెప్పారు. ఇక వైసీపీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత కారణం కోటరీ అని చాలా మంది విమర్శలు చేశారు. ఇలా ఎవరెన్ని చేసినా కూడా ఆయన మాత్రం అలా కొనసాగుతున్నారు. అంతే కాదు ఆయనకు మంచి పదవులే దక్కుతున్నాయి. ఆయనే వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీలో ఇపుడు మరింత కీలకంగా మారిపోయారు.

ఒక విధంగా ఆయనకు ఆ ప్లేస్ దక్కడానికి విజయసాయిరెడ్డి లాంటి వారి పరోక్ష సహకారమే అని అంటున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడి బయటకు వెళ్ళడంతో సజ్జల ర్పాధాన్యతకు ఎదురు లేకుండా పోయింది అని అంటున్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా వైసీపీ హైకమాండ్ చేసింది. అంతే కాదు ఆయనకు కొన్ని జిల్లాలను అప్పగించి రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించింది.

దాంతో ఆయన వాటితోనే ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో వైసీపీలో ముఖ్య నేతలలో సజ్జల మాత్రమే బాగా ఫోకస్ అవుతున్నారని అంటున్నారు. చాలా మంది నేతల విషయానికి వస్తే కొందరు కేసులలో ఇరుక్కున్నారు. మరి కొందరు అయితే అరెస్టులు అవుతున్నారు. ఈ కీలక సమయంలో సజ్జల పార్టీకి పెద్ద దిక్కుగా మారుతున్నారు అని అంటున్నారు.

అయితే పార్టీ నిర్వహణ అన్నది అతి పెద్ద బాధ్యత. దానికి సజ్జలకు వేరే ఆల్టర్నేషన్ వేరే లేకుండా పోయింది అని అంటున్నారు. ఒక దశలో ఆయనను కాదని వేరే చూడాలనుకున్నా కుదరలేదని చెబుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలలో వైసీపీ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది.

అయితే అప్పట్లో కొంతకాలం మౌనంగా ఉన్న సజ్జల తిరిగి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రాధాన్యత బాగా ఎక్కువ అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఆయన స్థాయి నేత మరొకరు లేకపోవడం అని అంటున్నారు. అంతే కాదు పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు వేరే వారికి తీరుబాటు లేకపోవడం అని కూడా అంటున్నారు.

దాంతో సజ్జల పూర్వం పొజిషన్ ఆయన హోదా అన్నీ ఇపుడు మళ్ళీ దక్కుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే సజ్జలకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పగిస్తారు అని కూడా ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆయన అత్యంత క్రీయాశీలంగా పార్టీలో ఉన్నారు. మరి దాని కంటే అతి ముఖ్యమైన పదవి ఏమిటి ఉంటుంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా సజ్జల ప్రాధాన్యత అంతకంతకు వైసీపీలో పెరుగుతోంది. ఆయన కూడా ఇటీవల కాలంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విష బీజేలను నాటుతున్నారని అది మంచి విధానం కాదని కూడా సజ్జల చెబుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత బదులు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి సజ్జల పూర్వ వైభవం వైసీపీకి ప్లస్ అవుతుందా లేక కోటరీ విమర్శల వల్ల చేటు తెస్తుందా అన్నది మాత్రం అంతా చర్చించుకుంటున్నారు.