వైసీపీ ఉక్కిరి బిక్కిరి.. ఏం జరుగుతోంది ..!
దీంతో గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఆచి తూచి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి రోజా అయితే.. ఎక్కడా కనిపించడమే లేదు.
By: Tupaki Desk | 24 Jun 2025 7:00 AM ISTఏపీ ప్రతిపక్షం.. వైసీపీకి అంతర్గతంగా ఊపరి ఆడడం లేదా? ఉక్కపోతకే కాదు.. ఉక్కిరి బిక్కిరికి కూడా గురవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా పార్టీ ఓటమి తర్వాత.. సింపతీ రావాలి. ఏడాది కాలంలో దీనిని గెయిన్ చేసుకుని ఉండాలి కానీ, అలా జరగలేదు. పైగా.. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలతో పార్టీ ప్రతిభ, ప్రాభవం కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. గత ఏడాది కాలంతో పోల్చుకుంటే.. ఈ నెలలోనే పార్టీకి చాలా మైనస్‌లుపడ్డాయి.
గతంలో కీలక నాయకులు పార్టీని వదిలేశారు. దీంతో పార్టీ ఇరుకున పడింది. గళం వినిపించేవారు లేకుం డా పోయారు. ఉన్న వారిలోనూ ఎక్కడో కేసుల భయం వెంటాడుతోంది. దీంతో గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఆచి తూచి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి రోజా అయితే.. ఎక్కడా కనిపించడమే లేదు. ఇక, పేర్ని నానిపై కేసులు చుట్టుముట్టాయి. వల్లభనేని వంశీ కేసుల ఊబిలో ఉన్నారు. కొడాలి నాని రియాక్ట్ కావడం లేదు. ఇలా.. కీలక నాయకులు ఫైర్ బ్రాండ్లు మౌనం వహించారు.
మరోవైపు.. జగన్ పర్యటనలు కూడా వివాదం అవుతున్నాయి. పొదిలిలో పర్యటించినప్పుడు మహిళలపై రాళ్లు, చెప్పులు పడ్డాయి. దీనిపై కేసులు నమోదయ్యాయి. యువతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక, తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల ఘటనలో కార్యకర్తలు వీరంగం వేశారు. నరుకుతాం.. చంపుతాం.. అంటూ బోర్డులు ప్రదర్శించారు. ఇక, ఓ వ్యక్తి కాన్వాయ్ కింద పడి మృతి చెందాడు. ఇలా.. అనేక పరిణామాలతో ఇప్పుడు జగన్ పర్యటనలు అంటేనే మైనస్ అయిపోతున్నాయి.
వీటికితోడు.. జగన్ చేస్తున్న కామెంట్లు కూడా.. ప్రజలకు నచ్చడం లేదు. నరుకుతాం.. చంపుతాం.. అనేకా మెంట్లను జగన్ సమర్థించడం మధ్యతరగతి వర్గానికి చిర్రెక్కిస్తున్నాయి. ఇక, సొంతగా మాట్లాడడం ఆయ న మరిచిపోయారు. స్క్రిప్టు చూసుకుని చదువుతున్నాడు. ఇలా.. ఉంటే.. మరోవైపు... ఆయన సోదరి షర్మిల ఎక్కడా తగ్గడం లేదు. ఏ చిన్న అవకాశం వచ్చినా.. అన్నపై నిప్పులు చెరుగుతోంది. మొత్తంగా చూస్తే.. వైసీపీ పరిస్థితి ఏడాది తర్వాత కూడా మారకపోగా.. మరింతగా ఇబ్బందుల్లోకి జారుతోంది.
