Begin typing your search above and press return to search.

వైసీపీ సర్వేలను నమ్ముకుంటోందా ?

ఇంకో వైపు చూస్తే వైసీపీకి చెందిన నేతలు వరసగా జైలు పాలు అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్ళి వచ్చారు.

By:  Satya P   |   2 March 2026 8:58 AM IST
వైసీపీ సర్వేలను నమ్ముకుంటోందా ?
X

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. అయితే అసెంబ్లీలో వైసీపీ కనిపించడం లేదు, ఆ పార్టీ అధినాయకత్వం అయితే జనంలోకి వెళ్ళడం లేదు, ఇక పార్టీ నాయకులు కూడా జనంలోకి వెళ్తున్న విషయాలు తక్కువగానే ఉన్నాయి. మరో వైపు చూస్తే కనుక మీడియా మీటింగులతోనే బిగ్ సౌండ్ చేసే నేతలు కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో తిరుమల లడ్డూ వివాదంలో కూడా వైసీపీ కొంత ఇబ్బంది పడింది. అయినా సరే తన వైపు వెర్షన్ ని వినిపిస్తోంది.

జైలు పాలు అవుతున్నారు :

ఇంకో వైపు చూస్తే వైసీపీకి చెందిన నేతలు వరసగా జైలు పాలు అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్ళి వచ్చారు. ఆయన మీడియా ముందు మళ్ళీ గట్టిగానే మాట్లాడుతున్నారు. అంబటి ఏపీలో హాట్ టాపిక్ అయ్యారని వైసీపీకి సానుభూతి వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో కేవలం ఇరవై నెలలలోనే టీడీపీ కూటమి పని అయిపోయింది అని వైసీపీ నేతలు అంటున్నారు వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ధీమాగా చెబుతున్నారు.

సర్వేలతోనేనే :

ఇదిలా ఉంటే ఆ మధ్యన లిక్కర్ స్కాం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన ఒక నాయకుడు మళ్ళీ సర్వేలు చేయిస్తున్నారు అని అంటున్నారు. ఆయన తాజాగా సర్వే చేయించి అధినాయకత్వం ముందు పెట్టారని ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు అని అంటున్నారు. దానికి కారణాలు ఏమిటి అంటే లడ్డూ ఇష్యూ అధికార పక్షానికి బూమరాంగ్ అయిందని అలాగే అంబటి రాంబాబు ఎపిసోడ్ లో సానుభూతి వచ్చిందని కూటమి పాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అయితే అంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద నిజంగా ఉందా అన్నది ఒక చర్చ. ఈ రకమైన సర్వే నివేదికను సొంత పార్టీ వారే పెద్దగా నమ్మడం లేదని అంటున్నారు.

గతంలోనూ అదే తీరు :

ఇక ఆ నాయకుడు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ఇదే తీరున సర్వేలు చేయించి వైసీపీకి ఢోకా లేదని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పారని గుర్తు చేస్తున్నారు. తీరా ఫలితం చూస్తే దారుణంగా వచ్చిందని అంటున్నారు. అందువల్ల సర్వేలను నమ్ముకోకుండా వైసీపీ జనంలోకి వెళ్ళాలని గ్రౌండ్ రియాలిటీస్ చూడాలని సూచనలు వస్తున్నాయి. ఏ పార్టీ అయినా ప్రజలతో ఉంటేనే జనాల ఆదరణ దక్కుతుందని వైసీపీ ఆ విధంగా ముందుకు సాగాలని తప్పించి సర్వేలను నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులే ఎదురవుతాయని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో ధీమా పెరుగుతోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా ధీమా ఉండడం తప్పు లేదు, కానీ అది అతి ధీమా కాకూడదని అంటున్నారు. పైగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎప్పటికపుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందై అంతే తప్ప సర్వేల పేరుతో భ్రమలలోకి వెళ్తే ట్రబుల్స్ తప్పవని అంటున్నారు.