Begin typing your search above and press return to search.

వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా ?

ఆయన ఎవరో కాదు వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.

By:  Tupaki Desk   |   14 Jun 2025 6:20 PM
వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా ?
X

వైసీపీ ఎమ్మెల్యే ఒకరు అరెస్ట్ అయ్యే చాన్స్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీదనే కేసులు నమోదు అయ్యాయి తొలిసారి వైసీపీ నుంచి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఒకరి మీద కేసు నమోదు అయింది. దాంతో ఆయన అరెస్ట్ తప్పదని చర్చ సాగుతోంది.

ఆయన ఎవరో కాదు వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. 2024 ఎన్నికల్లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైసీపీకి ఆయన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటున్నారు.

ఇంతకీ ఏమి జరిగింది అంటే ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 11న జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పొగాకు రైతులను పరామర్శించారు. అయితే జగన్ పర్యటన నేపధ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. దాంతో పాటుగా జన సమ్మర్ధం ఎక్కువ అయింది.

ఈ నేపధ్యంలో అక్కడకు చేరుకున్న టీడీపీ మహిళలు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా జగన్ కి చెందిన టీవీ చానల్ లో ఒక జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళల మీద పోలీసుల మీద వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వారు అని పోలీసులు కేసు పెట్టారు దాంతో పాటుగా ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి మీద కేసు పెట్టారు.

దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు వెళ్ళగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన పీఏకు నోటీసులు పోలీసులు ఇచ్చారని అంటున్నారు. దీంతో శివప్రసాదరెడ్డిని పోలీసులు విచారిస్తారని అంటున్నారు. అయితే ఆయన అందుబాటులో లేరని చెబుతున్నారు.

మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. కానీ ఆయన అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే తమ పర్యటనలో తమ కార్యక్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే టీడీపీ తన పార్టీ వారిని పంపించిదని ఇపుడు తమ వారి పైన కేసులు నమోదు చేయడమేంటి అని వైసీపీ వాదిస్తోంది.

అయితే శివప్రసాదరెడ్డి అజ్ఞాతం నుంచి వీడి ఎపుడు బయటకు వస్తారు అన్నది ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తే మాత్రం వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్యే అరెస్ట్ అయినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.