Begin typing your search above and press return to search.

వైసీపీ టికెట్లు...సవాలక్ష డౌట్లు

సాధారణంగా పార్టీలో అధినాయకుడు ఏదైనా చెబితే అది శాసనం అవుతుంది. లీడర్లు అంతా పాటించాలి.

By:  Satya P   |   15 April 2026 10:00 AM IST
వైసీపీ టికెట్లు...సవాలక్ష డౌట్లు
X

సాధారణంగా పార్టీలో అధినాయకుడు ఏదైనా చెబితే అది శాసనం అవుతుంది. లీడర్లు అంతా పాటించాలి. అయితే వైసీపీలో మాత్రం ఓటమి తరువాత కూడా యాక్టివ్ గా అయితే సీన్ కనిపించడంలేదు. అధికారంలో ఉన్నపుడు ఎన్నో ముఖాలు కనిపించాయి. ఎంతో మంది లీడర్లు హడావుడి చేసేవారు. కానీ ఓటమితో వారంతా సైడ్ అయిపోయారు. ఇప్పటికి రెండేళ్ళు అవుతున్నా పెద్దగా అయితే కనిపించడంలేదు. నిజానికి ఈ రోజు నుంచి జనంలోనూ హైకమాండ్ దృష్టిలోనూ ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుంది. కానీ ఆ విషయం తెలిసినా చాలా మంది ఎందుకు సైలెంట్ అవుతున్నారు, ఎందుకు సైడ్ అవుతున్నారు అంటే అక్కడే చాలా మ్యాటర్ ఉంది అని అంటున్నారు.

టికెట్ గ్యారంటీ లేదా :

వైసీపీలో అయితే టికెట్ గ్యారంటీ లేదనే చాలా మంది మౌన ముద్ర దాలుస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజు నుంచి డబ్బులు ఖర్చు చేసి సమయం వెచ్చించినా చివరిలో జరిగే మార్పులలో బలి అవుతామని అనుమానంతో చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఇక ఐ ప్యాక్ చేసిన సర్వేలు అంటూ గతంలో చాలా మందిని ఉన్న చోట నుండి వేరే చోటకు మార్చిన అధినాయకత్వం ఇపుడు కూడా మరో వ్యూహకర్తను తీసుకుంటోందని ప్రచారం సాగుతోంది. దాంతో ఆ వ్యూహకర్త సర్వేల పేరుతో ఇచ్చిన నివేదికలు కనుక తమకు యాంటీగా ఉంటే టికెట్ ఇవ్వరని ఆలోచిస్తున్నారుట. వ్యూహకర్త మాటకే అధినాయకత్వం విలువ ఇస్తుంది కానీ తమను పట్టించుకోదు అన్న ఆవేదన వారిలో ఉంది అని అంటున్నారు.

కొత్త సీట్లతో పేచీ :

ఇపుడు మరో చర్చ కూడా సాగుతోంది. ఉన్న సీట్లు ఈ రూపంలో ఉండవని పునర్ విభజనలో అవి ఏ విధంగా మారుతాయో ఏవరూ చెప్పలేరని అంటున్నారు. తాము ఈ సీట్లను నమ్ముకుని పనిచేసినా రేపటి రోజున ఇవి ఉండకపోతే కొత్త సీట్లలో కొత్తగానే పనిచేయాల్సి ఉంటుంది కదా అన్నది కూడా చాలా మంది ఆలోచన అంటున్నారు దాంతో ఇప్పటి నుంచే కష్టపడినా సుఖం లేదు అన్నది కూడా తేల్చేస్తున్నారుట. అలాగే మహిళా రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయో ఎలా అవి కేటాయిస్తారో అన్నది కూడా ఇంకో డౌట్ అని అంటున్నారు. ఏతా వాతా తేలేది ఏమిటి అంటే తాము జనంలోకి వచ్చినా డబ్బు కరగదీసినా టికెట్ విషయంలో అయితే ధీమా లేదని అనుకుంటున్నారుట.

ప్రతిపక్షంలో ఉంటూ :

నిజానికి విపక్షంలో ఉన్న వారికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వారు తొందరగా అభ్యర్థులను ప్రకటించగలరు, వారు జనంలోకి సులువుగా వెళ్ళగలరు, వారు ఫోకస్ అయ్యేందుకు చాన్స్ ఉంటుంది. మరి ఇవన్నీ వదిలేసుకుని సైలెంట్ అయితే వైసీపీకి నష్టం కదా అన్న మాట ఉంది. అయితే దీనికి అధినాయకత్వం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అధినాయకత్వం బలమైన నేతలకు ఎలాగైనా చాన్స్ ఉంటుందని నమ్మకం కలిగిస్తే అనేక మంది నేతలు జనంలో ఉంటారని లేకపోతే ఎపుడూ కనిపించే పది మంది మాత్రమే అలా మీడియా ముందు మెరుస్తూ ఉంటారని అంటున్నారు. ఈ విషయాలు అన్నీ హైకమాండ్ కి తెలియవా అంటే తెలుసేమో, మరి జనాల వద్దకు నాయకులను నడిపించే మంత్రం వారి వద్ద ఉందేమో చూడాలి.