ఇద్దరు నానీలు.. ఒక వంశీ.. కలిసిన వేళ.. విషయమేంటి?
అనంతరం.. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ మండలస్థాయి నాయకుడి ఇంట్లో వంశీ, కొడాలి నాని, పేర్నినానిలు కలుసుకున్నారు.
By: Tupaki Desk | 5 July 2025 7:23 PM ISTవైసీపీకి చెందిన నాయకులు, ఫైర్ బ్రాండ్ నేతలు.. ఒకే సోఫాలో పక్కపక్కన కూర్చుని కలిసి మాట్లాడుకుం టున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురూ కేసుల బాధితులే కావడంతో వారు ముగ్గురు ఏం చర్చించు కున్నారన్నది సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే.. ఇటేవలే జైలు నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీని కలుసుకున్నారు. గన్నవరం మండలం ఉంగుటూరులో ఓ ఇంట్లో ఈ ముగ్గురు సమావేశం అయ్యారు.
వంశీ సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఇక, కొడాలి కూడా.. గతంలో జరిగిన ఓ దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చిన కోర్టు.. శనివారం శనివారం స్టేషన్‌లో సంతకాలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు.
అనంతరం.. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ మండలస్థాయి నాయకుడి ఇంట్లో వంశీ, కొడాలి నాని, పేర్నినానిలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి వ్యక్తిగత విషయాలతోపా టు.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. కేసులపై చర్చించారు. ఇప్పట్లో కూటమిపై ఎలాంటి విమర్శలు చేయరాదని.. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్న ధోరణిని వ్యక్తపరిచారు. అనవసరంగా కేసులు పెడుతున్నారని.. ఇంతకు ఇంత బదులు తప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
పేర్నినాని కూడా.. ఇదే వ్యాఖ్యలు చేశారు. తనపై కూడా లేనిపోని కేసులు పెట్టారని.. బియ్యం ఎవరు అమ్ముకోవడం లేదని.. అందరూ ఆ పులుసులో ముక్కలేనని.. కానీ, మనపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నా రని ఆయన వ్యాఖ్యానించారు. విధాన పరమైన విమర్శలకు పరిమితం అవుతామన్న ధోరణిని వ్యక్త పరిచా రు. ఈ సందర్భంగా గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేల గురించికూడా వారి చర్చల మధ్య వచ్చింది. అయితే.. ప్రస్తుతానికి ఎవరిపైనా దూకుడుగా వెళ్లొద్దని భావించారు.