'పార్ట్‌టైమ్' నుంచి ఫుల్ టైమ్‌కు మారలేరా.. !
అయితే ఈ 17 మార్చాల్లో వైసిపి నాయకులు ప్రజల మధ్యకు వచ్చింది కానీ ప్రజల సమస్యలు పట్టించుకున్నది కానీ పెద్దగా కనిపించడం లేదు.
By: Garuda Media | 6 Dec 2025 11:00 PM ISTవైసీపీ నాయకుల వ్యవహార శైలి చూస్తే ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు గత ఎన్నికల తర్వాత 17 మాసాల సమయం గడిచిపోయింది. అయితే ఈ 17 మార్చాల్లో వైసిపి నాయకులు ప్రజల మధ్యకు వచ్చింది కానీ ప్రజల సమస్యలు పట్టించుకున్నది కానీ పెద్దగా కనిపించడం లేదు. పైగా ఒక పార్ట్ టైం ఉద్యోగి ఏ విధంగా అయితే పని చేస్తారో ఆ విధంగానే వైసిపి నాయకులు పనిచేస్తున్నారు. ఈ వాదన రాజకీయ నాయకుల్లో కాదు ప్రజల మధ్య ఎక్కువగా వినిపిస్తోంది.
ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా పార్ట్ టైం రాజకీయాలకు వైసిపి కేరాఫ్ గా మారిందని చెబుతున్నారు. నిజానికి భారీ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఒకింత బాధ అయితే ఉండొచ్చు. కానీ, అది ఎన్ని మాసాల తర్వాత కూడా ఇంకా కొనసాగుతూ ఉండడం ఇంకా నాయకులు ప్రజల మధ్యకు రాకపోవడం వంటివి మాత్రం పార్టీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందిగా మారుతున్నాయి. పార్టీ అధినేత జగన్ ఇతర నాయకుల వ్యవహార శైలి కూడా కేవలం పార్ట్ టైం వ్యవహారాల మాదిరిగా ఉంటున్నాయి అన్న వాదన బలంగా వినిపిస్తోంది.
నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులకు మాత్రమే గత ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేతగా చంద్రబాబు మూడు సంవత్సరాలు పాటు ప్రజల మధ్య ఉన్నారు. నిరంతరం ఆయన ప్రజల సమస్యల మీదే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆ దిశగా చూసుకుంటే వైసీపీలో అటువంటి ఫుల్ టైం పాలిటిక్స్ ఇంతవరకు కనిపించడం లేదు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం గా జగన్ ప్రజల మధ్యకు వెళ్ళింది అప్పుడప్పుడు మాత్రమే తప్ప.. తరచుగా వెళ్లలేదు.
కేవలం తాడేపల్లి కార్యాలయానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ పుంజుకునే దిశగా అడుగులు పడాలంటే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు అన్న వాదనను దాదాపుగా తుడిచి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. భవిష్యత్తులో అయినా పుంజుకోకపోతే కచ్చితంగా వైసీపీ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
