Begin typing your search above and press return to search.

నాన్చుతున్న నేత‌.. న‌లుగుతున్న వైసీపీ నాయ‌కులు.. !

అయితే దీనికి ఇంకా సమయం ఉందన్నట్టుగా పార్టీ అధినేత వ్యవహరిస్తున్నారు. మీ మీ ప్రాంతాల్లోనే పార్టీ తరఫున పనిచేయాలని కూడా చెబుతున్నారు.

By:  Garuda Media   |   9 March 2026 6:00 PM IST
నాన్చుతున్న నేత‌.. న‌లుగుతున్న వైసీపీ నాయ‌కులు.. !
X

వైసీపీకి చెందిన పలువురు యువ నాయకులు తీవ్ర సందిగ్ధంలో చిక్కుకున్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించే పరిస్థితిని కూడా వారు ఎదుర్కొంటున్నారు అన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఏదో నామ మాత్రంగానే పార్టీ తరపున పనిచేస్తున్న పరిస్థితి స్పష్టమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరేనన్నది సొంత పార్టీలో వినిపిస్తున్న విమర్శ. వచ్చే ఎన్నికలకు సంబంధించి తమకు బాధ్యతలు అప్పగించాలని తమ నియోజకవర్గాలను నిర్దేశించాలని పలువురు నాయకులు కోరుతున్నారు.

అయితే దీనికి ఇంకా సమయం ఉందన్నట్టుగా పార్టీ అధినేత వ్యవహరిస్తున్నారు. మీ మీ ప్రాంతాల్లోనే పార్టీ తరఫున పనిచేయాలని కూడా చెబుతున్నారు. కానీ, చాలామందికి ఈ విషయంలో ఇప్పటికి అనేక సందేహాలు ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడ తూర్పు నియోజకవర్గం తీసుకుంటే దేవినేని అవినాష్ యువ నాయకుడిగా ఇక్కడ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మంచి వాక్యాతుర్యం ఉంది. బలమైన కౌంటర్ ఇవ్వగల సత్తా కూడా సొంతం చేసుకున్న నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

పైగా కమ్మ సామాజిక వర్గంలో ఆయన దూసుకుపోయే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తారు? వచ్చే ఎన్నికల సమయానికి అంటే.. డౌటు నెలకొంది. దీంతో ఆయన ఎటువైపు అడుగు వేయాలన్నది సందేహంగా మారిందిజ‌ విజయవాడ ఎంపీగా పోటీ చేయమని కొంతసేపు... కాదు పెనమలూరు నియోజకవర్గం ఇస్తామని మరి కొంతసేపు... ఇవన్నీ కాదు మచిలీపట్నం నుంచి పోటీ చేయమని ఇంకోసారి ఇలా చెబుతుండడంతో దేవినేని అవినాష్ సందిగ్ధంలో పడ్డారు.

ఇక.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యువనాయకుడు పోతున్న వెంకట మహేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయన గత ఎన్నికల్లోనే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు . కానీ జనసేన ఆయనకు టికెట్ ఖరారు చేయకపోవడంతో పార్టీ మారి వైసిపి లోకి చేరారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటువైపు అడుగు వేయాలి అన్నది సందేహం. ఎందుకంటే తనకంటూ ఒక నియోజకవర్గం లేదు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మళ్ళీ నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించారు.

దీంతో ఇప్పుడు ఏం చేయాలి అన్నది పోతిన‌ మహేష్ కు ఉన్న ప్రధాన సందేహం. అలానే నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన‌ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం గత ఎన్నికల్లో ఆయనను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఆయన ఓడిపోయారు. దీంతో మళ్ళీ తిరిగి తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. కానీ అక్కడ కన్ఫర్మ్ కాలేదు. దీంతో ఇప్పుడైనా బయటికి వచ్చి పార్టీ తరపున పనిచేసినా వచ్చే ఎన్నికల నాటికి ఎక్కడ పోటీ చేయాలో అనేది సందేహంగా మారడంతో మౌనంగా ఉన్నారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలామంది నాయకులు జగన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆయనేమో నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. మొత్తంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెబుతున్నారు.