Begin typing your search above and press return to search.

జోగికి ముహూర్తం ఫిక్స్ ?

ఇక జనార్ధనరావు వీడియో బైట్ ఇలా వచ్చిందో లేదో అలా జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చేశారు.

By:  Satya P   |   20 Oct 2025 9:11 AM IST
జోగికి ముహూర్తం ఫిక్స్ ?
X

వైసీపీ కీలక నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇపుడు ఇబ్బందులో పడ్డారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు విచారణలో చెప్పిన విషయాలు ఆయన మాట్లాడిన కీలక అంశాలతో వదిలిన వీడియో బైట్ జోగి మెడకు ఉచ్చునే బిగించాయని అంటున్నారు. జోగి రమేష్ వల్లనే ఇదంతా అని ఆయన కల్తీ అంతా ఆయనకే అంటగట్టారు, జోగి రమేష్ దయ చేతనే ఇవన్నీ చేశాను అని కూడా పోలీసులకు చెప్పేసుకున్నారు, తప్పు ఒప్పేసుకున్నారు.

ఒట్టేసి చెబుతున్నా :

ఇక జనార్ధనరావు వీడియో బైట్ ఇలా వచ్చిందో లేదో అలా జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చేశారు. అందులో ఆయన చెబుతున్న మాటలు ఇస్తున్న వివరణలు పెడుతున్న ఒట్లు, చేస్తున్న సవాళ్ళు ఇవన్నీ కూడా మరో విధంగా మారుతున్నాయని అంటున్నారు. అంతే కాదు జోగి రమేష్ చేస్తున్న హడావుడి కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది అని అంటున్నారు. ఇక జోగి రమేష్ ఈ కేసు విషయంలో తనకు తానుగా లై డిటెక్టర్ ని కోరుతున్నారు. ఇంకా ఎలాంటి అగ్ని పరీక్షకు సిద్ధమని అంటున్నారు. అయితే ఇప్పటికే కల్తీ మద్యం వాసనలు అయితే ఆయనతో పాటుగా పార్టీని ఇరకాటంలో పెట్టేశాయనే అంటున్నారు.

కీలక ఆధారాలతో :

ఇక వరసగా జరిగిన సంఘటలు చూస్తే కనుక జోగి రమేష్ జనార్ధనరావు పక్క పక్కనే కూర్చున్న ఫోటోలు సడెన్ గా బయటకు రిలీజ్ అయి వారిద్దరి మధ్యన ఉన్న సాన్నిహిత్యం ఏంటో తెలియచేశాయని అంటున్నారు. అంతే కాదు ఈ ఇద్దరి మధ్యన జరిగిన వాట్సప్ చాటింగులను కూడా ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు అధికారులు సేకరించారని అంటున్నారు. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ అన్నీ చేసి అంతా చూసుకున్న మీదటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు అని అంటున్నారు.

దీపావళి తరువాత :

జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తూంటే కల్తీ మద్యం కేసులో అధికారులు చూపిస్తున్న దూకుడు వంటివి కనుక విశ్లేషించుకుంటే కనుక జోగి రమేష్ ని అరెస్టు చేసేందుకే పూర్వ రంగం అంతా సిద్ధం చేశారని అంటున్నారు. దీపావళి పండుగ పోయిన తరువాతనే జోగి రమేష్ అరెస్టు అంటూ ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఇదంతా ప్రచారమేనా లేక ఇందులో నిజముందా అన్నది చూడాల్సి ఉంది. అయితే జనార్ధనరావు ఇచ్చిన వివరాలు చెప్పిన విషయాలను కూడా జోగి రమేష్ తో చెక్ చేసుకునేందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అని అంటున్నారు.

వైసీపీకి ట్రబుల్ :

ఒక్కోసారి అతి ఉత్సాహమే బూమరాంగ్ అవుతుది. కల్తీ మద్యం విషయంలో వైసీపీ ఇపుడు కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితిని తెచ్చుకుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే తమ పార్టీకి చెందిన కీలక నేత మీదనే ఆరోపణలు రావడం వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్ధం కాక వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి చేస్తున్న హడావుడి మూలంగా వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది కూడా చర్చగా ఉందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.