Begin typing your search above and press return to search.

ఫుల్ సైలెంట్ మోడ్ లో బొత్స ?

వైసీపీ సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు.

By:  Satya P   |   16 April 2026 9:11 AM IST
ఫుల్ సైలెంట్ మోడ్ లో బొత్స ?
X

వైసీపీ సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. వారం రోజుల క్రితం ఆయన విశాఖలోని తన క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రి అచ్చెన్నాయుడు తన మీద చేసిన కామెంట్స్ ని ఖండించే క్రమంలో వెక్కి ఏడ్చారు. ఆ తరువాత ఆయన ఎక్కడా మళ్లీ బయటకు కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో బొత్స అచ్చెన్న తన మీద తప్పుడు ఆరోపణలు చేసారు అని ఆరోపించారు. కానీ దానికి కూటమి మంత్రులు కీలక నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేశారు.

క్లిప్పింగ్స్ తో సహా :

బొత్స కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఏపీకి ప్రెసిడెంట్ గా ఉన్నపుడు వైఎస్సార్ ని జగన్ ని ఆయన కుటుంబాన్ని ఎంత గట్టిగా టార్గెట్ చేసి విమర్శించారో నాటి వార్తా క్లిప్పింగ్స్ ని వీడియో బైట్స్ తో సహా టీడీపీ నేతలు తెచ్చి జనం ముందు పెట్టారు. నిజానికి అచ్చెన్నాయుడు జస్ట్ ఒక మాట అన్నారు కానీ అంత కంటే ఎక్కువగానే తీవ్ర విమర్శలే బొత్స జగన్ మీద వైఎస్సార్ ఫ్యామిలీ మీద చేశారు అని టీడీపీ నేతలు గుర్తు చేస్తూ మరీ బొత్సని కార్నర్ చేశారు. ఈ మొత్తం పరిణామాలను బొత్స ఊహించలేదా ఊహించినా కూడా వెక్కి ఏడ్చి అక్కడితో సరి అనుకున్నారా అన్నది అయితే తెలియడం లేదని అంటున్నారు.

అసలు పాయింట్ అక్కడే :

ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్లుగా బొత్స ఏడుపు అచ్చెన్నాయుడు తనను అన్నారని కాదని జగన్ వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారా అన్నదే ఆయన బాధ అని అంటున్నారు. మొత్తం మీద బొత్స అయితే ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక బొత్స మీద టీడీపీ నేతలు మంత్రులు అంతా కలసి పెద్ద ఎత్తున విమర్శలు చేసినా వైసీపీ నుంచి ఆయనకు మద్దతుగా పెద్దగా ఎవరూ మాట్లాడింది లేదని గుర్తు చేస్తున్నారు. దాంతో వైసీపీ అధినాయకత్వం బొత్స విషయంలో ఏ విధమైన వైఖరితో ఉంది అన్నదే పాయింట్ అని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో విమర్శలు అన్నవి సహజమే అయినా మరీ వ్యక్తిగతానికి పోయి చేసిన విమర్శలు అయితే గట్టిగానే గుచ్చుకుంటాయి. పరస్పరం అవసరం కోసం నాయకులు కలసినా పాత వాటిని మరచిపోలేరు, దీంతో పాత సంగతులు అన్నీ గుర్తు చేస్తూ ఇపుడు టీడీపీ కావాలనే కెలికిందా లేక బొత్స ఏడ్చి మరీ దానిని ఇంకా పెంచేశారా తెలియదు కానీ ఇపుడు మౌనమే నా భాష అని బొత్స అంటున్నారు. మరి ఆయన ఎపుడు పెదవి విప్పుతారు, వైసీపీ హైకమాండ్ ఆయనని ఏ విధంగా యాక్టివ్ చేస్తుంది అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.