Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసులో కీలక పరిణామం!

అవును... వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   22 July 2025 7:22 PM IST
బిగ్  బ్రేకింగ్... అనంతబాబు డ్రైవర్‌  హత్య కేసులో కీలక పరిణామం!
X

గత ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన వ్యవహారాల్లో వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఒకటనే సంగతి తెలిసిందే. అప్పట్లో మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. హత్య తానే చేశానని అనంతబాబు అంగీకరించారని పోలీసులు తెలిపారు! ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా... 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

కాగా... మే 19 - 2022న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సంగతి తెలిసిందే! డ్రైవర్ ను హతమార్చిన వైసీపీ నేత అనంతబాబు.. డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారనే ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. నాడు ఈ విషయంపై స్పందించిన అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు... నేరాన్ని అనంతబాబు అంగీకరించారని తెలిపారు!

ఆ సమయంలో... అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. తర్వాత మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు. మరోవైపు... తమకు న్యాయం చేయాలని.. అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఈ నేపథ్యంలో... ఈ కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ఇటీవల సిట్ కోర్టును కోరగా.. ఈ మేరకు అనుమతి లభించింది.

కాగా... డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు 2023లో వైసీపీ ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌ గా ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత.. సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్‌ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్వారపూడిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ లో ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగ అవకాశం కల్పించింది.