Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బిజీ.. మీరే తేల్చుకోండి ..!

ఇటీవల కాలంలో వైసీపీలో పలు వివాదాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు వివాదాలు కొనసాగుతున్నాయి.

By:  Garuda Media   |   24 April 2026 6:00 PM IST
జ‌గ‌న్ బిజీ.. మీరే తేల్చుకోండి ..!
X

ఇటీవల కాలంలో వైసీపీలో పలు వివాదాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాల నుంచి తాడేపల్లి పార్టీ కార్యాలయానికి వివాదాలు వస్తున్నాయి. వీటిని పరిష్కరించాలంటూ నాయకులు కోరుతున్నారు. సహజంగా ఏ పార్టీలో అయిన వివాదాలు కొనసాగుతుంటాయి. వాటిని పరిష్కరించాలంటూ పార్టీ పెద్దలను నాయకులు కోరుతారు. ఇది సహజం.

కానీ ఈ విషయంలో వైసిపి అధిష్టానం పట్టించుకోవడం మానేసింది. మీకు మీరే సర్దుకోండి అన్ని జగనే చూడలేరు అని నాయకులకు తేల్చి చెబుతోంది. దీంతో వైసీపీలో ఇప్పుడు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం, నాయకులు కూడా ఎవరికి వారుగా వ్యవహరించడం వంటివి చర్చ నియాంశంగా మారాయి. ఇది క్షేత్రస్థాయిలో పార్టీని అత్యంత బలహీన పరుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించే అంశం కూడా ఇదేనని తెలుస్తోంది.

నిజానికి టిడిపిలో క్రమశిక్షణ సంఘం ఉంది. కాని వైసీపీలో క్రమశిక్షణ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని పర్యవేక్షించేందుకు ఒక కమిటీ కానీ ఒక నాయకుడు కానీ లేకపోవడం విశేషం. ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారన్నమాట వినిపిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో ఆయన కూడా స్పందించడం లేదు. మావిగన్ విషయంలో జరిగిన తేడా కారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాలను చూస్తున్నప్పటికీ ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

దీంతో మీకు మీరే సర్దుకోండి అని పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వివాదాలు సర్దుబాటు కాకపోవడంతో పాటు నాయకుల మధ్య వివాదాలను మరింత పెంచుతోంది. మరి ఇది ఎటువైపు దారి తీస్తున్నది చూడాలి. వ‌చ్చే ఏడాది జ‌గ‌న్‌ పాద‌యాత్ర ఉన్న నేప‌థ్యంలో నాయ‌కుల మ‌ధ్య క‌లివిడిత‌నం.. క‌లుపుగోలు ముఖ్యం. కానీ, 50కిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో బాధ్యులు లేక‌పోవ‌డం.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కొన‌సాగుతున్న క్ర‌మంలో వైసీపీ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది చూడాలి.