Begin typing your search above and press return to search.

జగన్ టాస్క్ చేయకపోతే ఇంచార్జి పోయినట్లేనా ?

ఈ నేపధ్యంలో జగన్ ఏమి చెబితే అదే చేయాలని కీలక నేతలు అంటున్నారు. ఈ మధ్యన చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పధకాన్ని అమలు చేసింది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 7:00 AM IST
జగన్ టాస్క్ చేయకపోతే ఇంచార్జి పోయినట్లేనా ?
X

వైసీపీ అధినేత జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడవాల్సిందే. ఆయన దిశానిర్దేశం చేసినట్లుగానే నాయకులు పనిచేయాలి. అదే విషయం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు గట్టిగానే చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ ఒక్ బిగ్ టాస్క్ కూడా వారికి ఇచ్చారు. మరి ఆ టాస్క్ ఏమిటో అది చేయకపోతే వచ్చే పరిణామాలు ఏమిటో అన్న చర్చ అయితే వైసీపీలో సాగుతోంది.

తాజాగా జగన్ కొత్త ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టారు. ఇది ఇంటింటికీ వైసీపీ నేతలకు కార్యకర్తలను పంపించే కార్యక్రమం. ఇక వెనకటికి వెళ్తే 2019 ఎన్నికల ముందు చూస్తే గడప గడపకు నవరత్నాలు అని ఒక ప్రోగ్రాం ఇచ్చి మరీ ఇంటింటికీ పార్టీ ఇంచార్జిలను తిప్పి బాగా పాపులర్ అయ్యారు జగన్. దాంతో 151 సీట్లతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కింది.

ఇక జగన్ గెలిచిన తరువాత అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో దాదాపుగా 92 శాతం హామీలను నెరవేర్చామని ఆ పార్టీ చెబుతోంది. అయితే ఆ విషయం ప్రజలు చెప్పాలని అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నిజంగా అన్ని హామీలు వైసీపీ నెరవేరిస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓటమి పాలు అయింది అన్నదే ప్రశ్న. అయితే దీనిని వైసీపీ నేతలు రకరకాలైన కారణాలు చెబుతున్నారు.

వీటి కంటే కూడా ఒక బలమైన కారణం ఉంది కానీ వైసీపీ హైకమాండ్ ఈ రోజుకీ ఒప్పుకోదనే అంటున్నారు. నిజానికి వైసీపీ ఒరిజినల్ గా ఎందుకు ఓటమి పాలు అయింది అంటే కనుక వాలంటీర్ల వ్యవస్థను మధ్యలో తీసుకుని వచ్చి పార్టీని వైసీపీ అధినాయకత్వం నేరుగా చంపేయడం వల్ల అని అంటారు.

ఈ వ్యవస్థ వల్ల లాభమని జగన్ భావించారు. కానీ అదే చివరికి బూమరాంగ్ అయింది అంతే కాదు ఈ వ్యవస్థ వల్ల వైసీపీకి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా సైలెంట్ అయ్యారు. మధ్యలో మాకు ఎందుకొచ్చిన తంటా అని వారు గమ్మున ఉన్నారు అని అంటారు. అలా అటు వాలంటీర్లు చెప్పక ఇటు పార్టీ నేతలు చెప్పక వైసీపీ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి జనాలలోకి వెళ్ళలేకపోయాయని అంటున్నారు.

ఇక ఎన్నికల్లో చూస్తే కనుక వైసీపీ అధినాయకత్వం వాలంటీర్లనే చాలా గుడ్డిగా నమ్ముకుంది అని అంటారు. అలాగే వైసీపీ క్యాడర్ సైతం వాలంటీర్లు చేస్తారు అని టీడీపీ నేతలతో కుమ్మక్కు అయి జగన్ కి ఒకసారి గట్టి ఝలక్ ఇవ్వాలని కావాలని ఇచ్చారు అని అంటారు.

ఇలా వైసీపీ క్యాడర్ ఎందుకు ఝలక్ ఇచ్చింది అంటే నిజానికి వైసీపీ పుట్టిందే కాంగ్రెస్ క్యాడర్ తో. అలా కాంగ్రెస్ క్యాడర్ అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంట ఉంటూ వచ్చింది. వైఎస్సార్ రెండోసారి సీఎం అయ్యాక అనూహ్యగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు.

ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ జగన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. దాంతో వైఎస్ జగన్ తానే సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అలాంటి పరిస్థితులు నాటి కాంగ్రెస్ పెద్దలే తీసుకుని వచ్చారు అని అంటారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ క్యాడర్ అంతా వైఎస్ జగన్ వెంట నిలిచింది. ఇలా చూస్తే కనుక ఒక సాధారణ ఎంపీ నుంచి ఒక రాజకీయ పార్టీ అధినేతగా మారిన జగన్ సక్సెస్ కి మూడు ప్రధాన కారణాలు పనిచేశాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

అవి సానుభూతి, వైఎస్సార్ విగ్రహాలు, ఓదార్పు యాత్ర అని చెప్పాలి. ఈ సమయంలో జగన్ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఒక విధంగా ఎవరూ తిరగని విధంగా జగన్ ప్రజలతో కలసి తిరిగారు. అంతలా ఆయన మమేకం అయ్యారు. అంటే 2011లో జగన్ పార్టీ పెట్టినది లగాయితూ మధ్యలో 16 నెలలు జైలు జీవితం తప్ప 2019 దాకా నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనాలతోనే ఉన్నారు.

ఇక ఎపుడైతే జగన్ 2019లో సీఎం అయ్యారో ఆనాటి నుంచి ఆయన జనంలోకి రాకుండా పార్టీ క్యాడర్ తో కానీ జనాలతో కానీ కనెక్షన్ లేకుండా గడిపారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇదే క్రమంలో క్యాడర్ తో పూర్తిగా కనెక్షన్ తెగిపోయింది. అందుకే దారుణంగా రాయలసీమలో సైతం వైసీపీ ఓటమి పాలు అయింది. ఏపీ ఏర్పడిన నాటి నుంచి రాయలసీమలో కాంగ్రెస్ కే ఎక్కువ బలం ఉండేది. ప్రతీ ఎన్నికలోనూ అరవై నుంచి 70 శాతం దాకా ఓట్లు ఆ పార్టీకే వచ్చాయి. ఇక జగన్ వైసీపీ పెట్టాక పూర్తిగా రాయలసీమ జగన్ వైపు టర్న్ అయింది. దాంతో టీడీపీ కూసాలు సీమ ప్రాంతంలో కదిలిపోయాయి.

వైసీపీ 151 సీట్లతో ప్రభుత్వం స్థాపించాక జగన్ క్యాడర్ ని పట్టించుకోకుండా ఉండడంతో వారంతా ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. దీంతోనే ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. వాస్తవాలు దారుణంగా ఉంటే ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతుంది అన్న దాని మీద జగన్ కి సరైన ఫీడ్ బ్యాక్ లేదని అంటున్నారు. బయట ఏమి జరుగుతుందో వైసీపీ పెద్దలకు తెలియడం లేదు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ ఏమి చెబితే అదే చేయాలని కీలక నేతలు అంటున్నారు. ఈ మధ్యన చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పధకాన్ని అమలు చేసింది. దీని మీద పెద్దగా వ్యతిరేకత కానీ అసంతృప్తి కానీ రాలేదు అంటే అందరికీ ఈ పధకం కింద నగదు అందింది అనే కదా అర్ధం అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ప్రజల వద్దకు వెళ్తే మొన్ననే కదా తల్లికి వందనం పధకం ఇచ్చారు అని చెబుతారు కదా అని కూడా ఉంది. అంతే కాదు సూపర్ సిక్స్ హామీలు మొత్తం ఒక క్రమ పద్ధతిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కదా అన్న ఆలోచన ఆశ కూడా ప్రజలకు ఉంటాయి కదా అని అంటున్నారు.

లోపల ఏమైనా అసంతృప్తి ఉన్నా కూడా ఇంకా నాలుగేళ్ళ పాలన ఉంది. పైగా పధకాలు అందాల్సి ఉంది కాబట్టి బయటకు బాగానే కూటమి పాలన ఉందనే వైసీపీ నేతలకు చెబుతారు కదా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇంచార్జిలు ఇంటింటికీ వెళ్ళి పధకాలు అందాయా అని అడగడం రాంగ్ టైం అని అంటున్నారు. అయినా జగన్ ఒకసారి అనుకుంటే చేయాల్సిందే. చెబితే అసలు వినరు కదా అన్నదే పార్టీ నేతల మాటగా ఉందిట.

ఈ సమయంలో వైసీపీ ఇంచార్జిలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతీ ఇంటికీ వెళ్ళి సూపర్ సిక్స్ మీద జనాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలీ అంటే అది చాలా పెద్ద కధ అని అంటున్నారు. అలాగని ఇంటింటికీ తిరగకపోతే వారి ఇంచార్జి పదవులు పోతాయని అంటున్నారు. ఇలా ఇంటింటి ప్రోగ్రామ్స్ ని ఇపుడే నిర్వహించి సరైన ఫలితాలు రాకుండా చేసుకోవడం కంటే కూడా పార్టీ క్యాడర్ ని పిలిచి వారికి అపాయింట్మెంట్ ఇస్తూ వారి ద్వారా పార్టీ పటిష్టతతో పాటు ఫీడ్ బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్నాయి. అయినా వైసీపీ అధినాయకత్వం వింటుందా అన్నదే అతి పెద్ద ప్రశ్న అంటున్నారు.