Begin typing your search above and press return to search.

స్థానిక పోరు: వైసీపీకి క‌లిసొచ్చే అంశాలేంటి.. ?

ఇటీవ‌ల కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేల‌తో భేటీ అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీపరంగా కొన్ని దిశానిర్దేశాలు చేస్తున్నారు.

By:  Garuda Media   |   1 July 2026 7:00 PM IST
స్థానిక పోరు: వైసీపీకి క‌లిసొచ్చే అంశాలేంటి.. ?
X

ఇటీవ‌ల కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేల‌తో భేటీ అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీపరంగా కొన్ని దిశానిర్దేశాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా వారికి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. ముఖ్యంగా గ‌త ప్రభ‌వం తిరిగి తీసుకురావాల‌న్న‌దే జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అయితే.. ఇది సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎవ‌రు అధికారంలో ఉంటే వారే స్థానికంగా విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు.

అందుకే.. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ అస‌లు పోటీ నుంచే త‌ప్పుకొంది. అయినా.. కొంద‌రు టీడీపీ నాయ‌కులు పోటీ చేశారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ స్థానికంలో అయినా.. గెలుపు గుర్రం ఎక్కి.. విజ‌యం ద‌క్కించుకుని గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో కూట‌మి ప్ర‌భుత్వంపై ఉన్న సానుకూల‌త వైసీపీకి క‌ల‌సి వ‌చ్చేలా లేదు. పింఛ‌న్ల పంపిణీ నుంచి గ్రామీణ స్థాయిలో జ‌రుగుతున్న అభివృద్ది వంటివి వైసీపీకి వ్య‌తిరేక‌త‌ను కొన‌సాగిస్తున్నాయి.

నాడు వైసీపీ ప‌నులు చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉండేద‌ని కూట‌మి నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ప‌డే ప్ర‌భావం ఉంద‌ని అంటున్నారు. దీనికితోడు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త కూడా క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ రావాలి.. పార్టీని ప‌ట్టించుకోవాల‌ని అనే నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గా ఉందే త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా బాధ్య‌త తీసుకుని ముందుకు సాగాల‌న్న ల‌క్ష్యంతో నాయ‌కులు ముందుకు క‌ద‌ల‌డం లేదు.

మ‌రోవైపు.. కూట‌మికి ఉన్న బ‌ల‌మైన వాయిస్ కూడా వైసీపీకి లేద‌నే చెప్పాలి. టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు..త‌మ బ‌ల‌మైన గ‌ళంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తుంటే.. వైసీపీ అధినేత మీడియా స‌మావేశాల‌కు.. చూసి చ‌దువుతున్న స్క్రిప్టు లకు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ఇవ‌న్నీ.. వైసీపీని ఇర‌కాటంలో నెడుతున్నాయి. ట్రోల్స్‌కు గుర‌య్యేలా కూడా చేస్తున్నాయి. ఈ ప్ర‌భావం కూడా స్థానిక ఎన్నిక‌ల‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను న‌మ్ముకున్న వైసీపీకి దానిని చేరువ కావ‌డం సాధ్యం కాద‌న్న అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి.