Begin typing your search above and press return to search.

వైసీపీ ఇంచార్జిలకు బిగ్ టెస్ట్ పెట్టిన జగన్ !

వైసీపీలో మొత్తం 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

By:  Satya P   |   27 May 2026 11:56 PM IST
వైసీపీ ఇంచార్జిలకు బిగ్ టెస్ట్ పెట్టిన జగన్ !
X

వైసీపీలో మొత్తం 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల ఇంచార్జి పదవిని అందుకుని కూడా పెద్దగా సౌండ్ చేయకుండా ఉంటున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరో వైపు చూస్తే ఇంచార్జిలు పెద్దగా క్యాడర్ తో టచ్ లోకి వెళ్ళడం లేదు అని విమర్శలు ఉన్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలు మూడేళ్ల వ్యవధిలో జరుగుతాయి కదా అపుడు చూసుకుందామని రెస్ట్ మోడ్ లోనే చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోనే పోరాటం అని జగన్ తేల్చి చెప్పేశారు. స్థానిక సంస్థలలో ఫైట్ చేయాల్సిందే అని దిశా నిర్దేశం చేశారు.

లైట్ తీసుకున్న వైనం :

స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఇంచార్జులలో పలువురు లైట్ తీసుకున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. ఎటూ అధికారంలో ఉన్న కూటమికే మొగ్గు ఉంటుంది అనవసరంగా ఫీల్డ్ లోకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్న ధోరణిలో ఉన్న వారూ అనేకమంది ఉన్నారని అంటున్నారు. పైగా 2021లో వైసీపీ అధికారంలో ఉన్నపుడు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకుని ప్రతిపక్షానికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వలేదు. ఇపుడు ఒకటి కాదు మూడు పార్టీలు కలసి ఉన్నాయి. దాంతొ కచ్చితంగా కూటమిదే పై చేయి ఉంటుందని భావించి కూడా మిన్న కున్న నేపథ్యం వైసీపీలో ఉంది అని అంటున్నారు.

నాలుగు నెలల టైం :

ఇపుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగాల్సిందే అని అధినేత జగన్ అదేశించారు. అంతే కాదు స్థానిక ఎన్నికల్లో కూటమి ఏకగ్రీవాలు అన్న మాట వినిపించకూడదు అని జగన్ సీరియస్ గానే చెప్పారు. వైసీపీ జెండా అన్ని చోట్లా ఎగిరి తీరాలని ఆయన అంటున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవం అన్నది జరిగితే అది కచ్చితంగా ఆ నియోజకవర్గం ఇంచార్జి వైఫల్యంగా భావిస్తాను అని కూడా జగన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఇంచార్జిలు పూర్తి సహకారం అందించాలని జగన్ సూచించారు. అలా వారికి ఈ రోజున సహకరిస్తే రేపు వారు సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి సహకరిస్తారు అని కూడా అన్నారు. ఇక చూస్తే స్థానిక ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో ఇంచార్జిలు అంతా మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ఉంది అని అంటున్నారు.

జాతకాలు మారుతాయి :

లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా వైసీపీ అభ్యర్ధుల పెర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా ఎకగ్రీవాలు ఎక్కువగా జరిగినా అది అటూ ఇటూ తిరిగి వైసీపీ ఇంచార్జి మీదకే వస్తుందని అంటున్నారు. దాంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాన్ని హోల్డ్ చేయలేదని భావించి పార్టీని ముందుకు నడిపే సామర్థ్యం లేదని కూడా తలచి పక్కన పెడతారా అన్నదే అందరిలో బెంగగా ఉంది అని అంటున్నారు. ఇంచార్జిల ఫెయిల్ గానే భావిస్తాను అని జగన్ ఒక స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఇపుడు ఇంచార్జిల మీదనే భారం అంతా పడుతోంది. జగన్ పెట్టిన ఈ బిగ్ టెస్ట్ లో ఎంత మంది పాస్ అవుతారో స్థానిక ఎన్నికల్లో తేలిపోతుంది అని అంటున్నారు. ఫెయిల్ అయిన చోట్ల కొత్త ఇంచార్జిలు వస్తారని కూడా అంటున్నారు.