మాజీ మంత్రులు కనిపించుటలేదా ..?
ప్రజల మధ్య తిరిగారు. కానీ.. వీరితో పోలిస్తే.. వైసీపీ నాయకులు మైనస్ అయ్యారు.
By: Tupaki Desk | 27 April 2025 1:30 PMరాష్ట్రంలో వైసీపీ నాయకులు చాలా మంది ఓడిపోయారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు. అయితే.. ఎంత ఓడిపోయినా.. ప్రజలకు చేరువ అయ్యేందుకు నాయకులు ప్రయత్నిస్తారు. కానీ, వైసీపీలో మంత్రు లుగా పనిచేసిన చాలా మంది నాయకులు ప్రజలను తప్పించుకుని తిరుగుతున్నారు. గతంలో టీడీపీ నాయకులు ప్రతిపక్షంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే పుంజుకున్నారు. ప్రజల మధ్య తిరిగారు. కానీ.. వీరితో పోలిస్తే.. వైసీపీ నాయకులు మైనస్ అయ్యారు.
ఉదాహరణకు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నారాయణ స్వామి.. గడ ప దాటడం లేదు. నిజానికి తాను తప్పుకొని తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నా.. విజయం దక్కించు కోలేక పోయారు. ఆ సమయంలో ఆయన ఓడినా.. ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. కానీ, ఇప్పుడు ఎక్క డా కనిపించడంలేదు. పోనీ.. ఆయన కుమార్తె అయినా.. కనిపిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు.
కడప నుంచి ప్రాధాన్యం వహించిన అంజాద్ బాషా.. వైసీపీలో మైనారిటీ శాఖను చూశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. తన సోదరుల కేసులతోనే ఆయన సరిపుచ్చు కుంటున్నారు. నిజానికి కడపలో వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. కానీ.. బాషా మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇక, విజయవాడ కు చెందిన పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. కేసుల భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
అప్పట్లో దేవాలయ శాఖను చూసిన వెల్లంపల్లి హయాంలోనే... విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమయ్యాయి. విజయనగరంలోని రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం శిరచ్ఛేదం కూడా జరిగింది. ఇక, అంతర్వేది రథం దగ్ధమైంది. ఈ కేసులు ఆయనకే చుట్టుకుంటున్నాయి. దీంతో తాను రాజకీయంగా యాక్టివేట్ అయితే.. ఇబ్బందులు తప్పవని.. రాజకీయాలు తర్వాత చేసుకోవచ్చని నిర్ణయించుకున్నట్టు ఆయన గురించి పెద్ద టాక్ నడుస్తోంది. మొత్తానికి తలకో రకంగా మాజీ మంత్రులు ఉన్నారు.