Begin typing your search above and press return to search.

వైసీపీ డిప్యూటీలు ... ఫుల్ సైలెంట్ మోడ్ లో !

వైసీపీ అధికారంలో ఉన్నపుడు దాదాపుగా పది మందికి తక్కువ కాకుండా ఉప ము ఖ్యమంత్రులుగా పనిచేశారు.

By:  Tupaki Desk   |   14 May 2025 3:35 AM
వైసీపీ డిప్యూటీలు  ... ఫుల్ సైలెంట్ మోడ్ లో !
X

వైసీపీ అధికారంలో ఉన్నపుడు దాదాపుగా పది మందికి తక్కువ కాకుండా ఉప ము ఖ్యమంత్రులుగా పనిచేశారు. వారిలో ఇపుడు ఎందరు యాక్టివ్ గా ఉన్నారు అన్నది చర్చగా ఉంది. వైసీపీ 2019లో తొలిసారి అధికారంలో ఉన్నపుడు మొదటి మూడేళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా ఆళ్ళ నాని, కె నారాయణస్వామి, పాముల పుష్ప శ్రీవాణి, ధర్మాన క్రిష్ణదాస్, ఆంజాద్ భాషా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండేవారు. ఆ తరువాత కె నారాయణస్వామి ఆజాద్ భాషాని కొనసాగిస్తొనే బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొరలకు జగన్ చివరి రెండేళ్ళు చాన్స్ ఇచ్చారు.

ఇలా చూస్తే కనుక మొత్తం తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రులుగా జగన్ కేబినెట్ లో పనిచేశారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన అధికారాలు లేకపోయినా రాజకీయంగా అధి ఒక పెద్ద హోదా. ప్రభుత్వం గురించి ఇచ్చిన గౌరవం. దాంతో వారు కూడా రాష్ట్ర స్థాయి నాయకుల మాదిరిగా ఉంటూ పార్టీలో కీలకంగా ఉండేవారు.

అలాంటిది వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయాక వీరిలో ఎందరు ఇపుడు పార్టీ తరఫున డిప్యూటీలుగా చురుకుగా వ్యవహరిస్తున్నారు అన్నది తీసుకుంటే ఆళ్ళ నాని వైసీపీ నుంచి బయటకు వెళ్ళి టీడీపీలో చేరిపోయారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కేవలం ఏడాది పాటు మాత్రమే డిప్యూటీ సీఎం గా చేసారు. ఆ తరువాత రాజ్యసభకు ఎంపీగా వెళ్ళారు.

ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉంటున్నారు. తన పరిధిలోనే రియాక్ట్ అవుతున్నారు. మరో వైపు చూస్తే మిగిలిన వారు అంతా సైలెంట్ గానే ఉన్నారు. ఇందులో కొందరు తమకు అప్పగించిన జిల్లా బాధ్యతలను చూస్తున్నారు. నిజానికి వీరిలో కొందరిని పీఏసీ మెంబర్స్ గా కూడా వైసీపీ నియమించింది.

ముఖ్యమంత్రి జగన్ తరువాత్ ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వారు పార్టీ ఇబ్బందులలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే గట్టిగా గొంతు పెంచాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు. అయితే తమ పరిధిలోనే వీరు రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు.

వైసీపీ సామాజిక వర్గాల పరంగా ఈ కీలక పదవులు అప్పగించింది. దాంతో వీరి మీద మరింత బాధ్యత ఉంది కదా అని అంటున్నారు. వైసీపీకి ఇపుడు మాట్లాడే గొంతులు కావాలి. వీరితో పాటుగా మొత్తం 40 మందికి పైగా మంత్రులు రెండు విడతల జగన్ మంత్రివర్గంలో పనిచేశారు. వారిలో కీలకమైన శాఖలు నిర్వహించిన వారు కూడా ఉన్నారు.

అయితే ఇపుడు ఎటు చూసినా ఒక రకమైన నిశ్శబ్దమే పార్టీలో ఉంది అని అంటున్నారు. కూటమి అధికారంలో ఉంది ఏమి మాట్లాడితే ఏమి వస్తుందో అన్న ఆలోచనలతోనే వీరంతా ఇలా ఉంటున్నారా అన్న చర్చ వస్తోంది. దాంతో వైసీపీ కీలకమైన బాధ్యతలు మోసిన వారే యాక్టివ్ రోల్ తీసుకోకుంటే మిగిలిన వారు మేము కూడా ఇంతే అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.