Begin typing your search above and press return to search.

బీజేపీకి వైసీపీ ఫస్ట్ ఝలక్ ఇస్తుందా...?

వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని అంశాలలో మద్దతు ఇస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2023 7:06 PM IST
బీజేపీకి వైసీపీ ఫస్ట్ ఝలక్ ఇస్తుందా...?
X

గత నాలుగేళ్ళుగా చూసుకుంటే అధికార వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని అంశాలలో మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో అనేక కీలక బిల్లులకు వైసీపీ పూర్తి మద్దతు ఇస్తూ వచ్చింది. అలా సాగు చట్టాలతో పాటు రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే బిల్లుల విషయంలోనూ మద్దతు ఇచ్చి విమర్శల పాలు అయింది.

అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు అత్యంత కీలకమైన వైసీపీకి కోర్ ఓటు బ్యాంక్ కే దెబ్బకొట్టే విధంగా ఉన్న కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అన్నదే అంతటా చర్చగా ఉంది. అయితే కామన్ సివిల్ కోడ్ బిల్లు చట్టం కావడం అన్నది బీజేపీకి చాలా ముఖ్యమైన విషయం. బీజేపీ పూర్వ రూపం అయిన జనసంఘ్ కాలం నుంచే కామన్ సివిల్ కోడ్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చింది.

అటువంటి బీజేపీ కామన్ సివిల్ కోడ్ ని ఈ వర్షాకాల సమావేశాలలోనే నెగ్గించుకోవాలని చూస్తోంది. నిజానికి 2024 తరువాత ఏర్పడే ప్రభుత్వంలోనే ఈ బిల్లుని తేవాలని బీజేపీ భావించింది. కానీ అపుడు బీజేపీకి సొంత మెజారిటీ వస్తుందో రాదో అన్న డౌట్ ఒక వైపు ఉంటే మరో వైపు 2024 ఎన్నికలకు సరైన ఆయుధం లేని పరిస్థితి. దాంతో ఈ బిల్లుని ముందుకు తెచ్చారని అంటున్నారు.

ఇదిలా ఉంటే కామన్ సివిల్ కోడ్ బిల్లు మీద జాతీయ స్థాయిలో విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అవన్నీ యాంటీగా ఓటేస్తాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని పార్టీల సంగతేంటి అన్నదే చర్చగా ఉంది. ఇప్పటికే దీని మీద కేసీయార్ తమ పార్టీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఇక లేటెస్ట్ గా సీఎం జగన్ తో వైసీపీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఇతర మిస్లిం వర్గాలు కలసి కామన్ సివిల్ కోడ్ బిల్లుని మద్దతు ఇవ్వవద్దు అని కోరినట్లుగా చెబుతున్నారు.

తాను మైనారిటీ పక్షపాతిని అని బిల్లు ఆ విధంగా మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే కనుక తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని సీఎం జగన్ చెప్పినట్లుగా వైసీపీ ముస్లిం నేతలు అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ బిల్లులో ముస్లిం మహిళలకు సంబంధించి స్వేచ్చ్చ్ను దెబ్బ తీసే క్లాజులు ఉన్నాయని వైసీపీ కర్నూల్ ఎమంలెయే హఫీజ్ ఖాన్ అంటున్నారు. అయితే తాను మహిళా పక్షపాతికి కూడా అని జగన్ చెప్పారని, కామన్ సివిల్ కోడ్ పైన డ్రాఫ్ట్ కూడా రెడీ కాలేదని, అది వచ్చాక అన్నీ చూసి కచ్చితంగా వ్యతిరేకిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక బీజేపీకి ప్రాణప్రదం అయిన ఈ బిల్లునకు రాజ్యసభలో ఓట్లు పడాలంటే అక్కడ నెగ్గాలంటే తొమ్మిది మంది వైసీపీ ఎంపీల మద్దతు చాలా అవసరం. వైసీపీ మీదనే పూర్తి ఆశలు పెట్టుకుంది బీజేపీ అన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. మరి జగన్ కనుక కామన్ సివిల్ కోడ్ బిల్లుని వ్యతిరేకిస్తే మాత్రం అది బీజేపీకి కచ్చితంగా భారీ షాక్ గా మారుతుంది.

ఈ బిల్లు చట్టం కాకుండా ఉండిపోతుంది. అపుడు బీజేపీ రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అంటున్నారు మరో వైపు ఎన్డీయే మీట్ కి టీడీపీని పిలవలేదు బీజేపీ. ఇపుడు టీడీపీకి రాజ్యసభలో ఉన్న ఒక్క ఎంపీ ఓటు ఎవరికి వేస్తారో అన్న చర్చ కూడా ఉంది. అలాగే లొక్ సభలో ఉన్న ముగ్గురు ఎంపీల ఓట్లు ఏ వైపు పడతాయో చూడాల్సిందే అంటున్నారు.