Begin typing your search above and press return to search.

టెక్కలి సేఫ్ గురూ.. అచ్చ‌న్న‌దే.. !

టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఆశ‌లు నానాటికీ దిగజారుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ పట్టు బిగించిన‌ మంత్రి.. టిడిపి సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చం నాయుడును ఓడించాలన్నది వైసిపి పెట్టుకున్న ప్రధాన లక్ష్యం.

By:  Garuda Media   |   14 Dec 2025 10:00 PM IST
టెక్కలి సేఫ్ గురూ.. అచ్చ‌న్న‌దే.. !
X

టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఆశ‌లు నానాటికీ దిగజారుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ పట్టు బిగించిన‌ మంత్రి.. టిడిపి సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చం నాయుడును ఓడించాలన్నది వైసిపి పెట్టుకున్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే గతంలో కూడా అనేక మార్పులు చేశారు. కానీ, ఈక్వేషన్ లు ఎప్పటికప్పు డు కుదరడం లేదు. దువ్వాడ శ్రీనివాస్‌ను గత‌ ఎన్నికల్లో పోటీకి పెట్టి విజయం సాధించాలని భావించారు. కానీ ఇంతలోనే ఫ్యామిలీ ట్రబుల్స్ వచ్చాయి. తీవ్ర వివాదాలు జరిగాయి. ఈ దీంతో ఆయన ప‌రాజ‌యం పాలయ్యారు.

పోనీ ఇప్పటికైనా పరిస్థితిలో ఏమైనా మార్పు జరిగిందా అంటే అది కూడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి అసలు టెక్కలిలో ఎవరు పోటీ చేస్తారు ? వైసిపి తరఫున ఎవరు నిలబడతారు ? అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే కనిపించడం లేదు. మరోవైపు దువ్వాడ శ్రీను పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ పెద్ద యాక్టివ్ గా అయితే ఆయన కనిపించడం లేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తారన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే అంతకన్నా అచ్చం నాయుడుకి కలిసి వచ్చే అంశం మరొకటి లేదనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో బలమైన సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకున్న సమయంలోనే వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభావాన్ని తట్టుకునే వైసిపి నాయకులు ఏ విధంగా ముందుకు సాగుతారో అన్నది ప్రధాన ప్రశ్న. పైగా దువ్వాడ శ్రీనివాస వంటి వివాదాస్పద నాయకుడికి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే అది పూర్తిగా టిడిపికి అనుకూలంగా మారుతుంది. పైగా ఈక్వేషన్లు కూడా ఫలించే అవకాశం లేదు. మొత్తానికి టెక్కలిలో ఇప్పటివరకు వైసీపీ ఎలాంటి ఆపరేషన్ చేయడం లేదు.

ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు ఫలితంగా ఇక్కడ వైసిపి పెద్దగా జోష్ అయితే కనిపించడం లేదు. ఇది అచ్చం నాయుడుకి కలిసి వస్తున్న ప్రధాన అంశం. అయినప్పటికీ ఆయన ఎక్కడా అలుపెరగ కుండా ప్రజల మధ్య ఉంటున్నారు. మంత్రిగా అదే విధంగా ఎమ్మెల్యేగా స్థానిక నాయకుడిగా అందరికీ చెరువలో ఉండ‌డం గమనించాల్సిన ప్రధాన విషయం.