పార్లమెంట్ ఈవీఎం...వైసీపీ బిగ్ సౌండ్
ఇక 2024 మేలో ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం గురించి ఆ పార్టీ లోక్ సభా నాయకుడు అయిన పీవీ మిధున్ రెడ్డి అనేక డౌట్లు వ్యక్తం చేశారు.
By: Satya P | 10 Dec 2025 7:00 AM ISTఏపీలో వైసీపీ దారుణంగా ఓటమి చెంది సరిగ్గా పద్దెనిమిది నెలలు గడచాయి. ఈ మధ్యలో ఈవీఎంల మీద వైసీపీ లోకల్ గా అక్కడడక్క మాట్లాడింది కానీ పార్టీ పరంగా ఎపుడూ అఫీషియల్ గా తన స్టాండ్ ఏంటి అన్నది అయితే వెల్లడించలేదు. జగన్ సైతం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఏమి జరిగిందో ఏమో అని నిట్టూర్చారు తన్న నేరుగా ఈవీఎంల మీద మాత్రం మాట్లాడింది లేదు, నిందించింది అంతకంటే లేదు, కానీ వైసీపీ ఫస్ట్ టైం అధికారికంగా తన విధానం ఈవీఎంల విషయంలో ఏమిటో తేటతెల్లం చేసింది పార్లమెంట్ వేదికగా ఆ పార్టీ ఈవీఎంల పనితీరు మీద తీవ్ర విమర్శలు చేసింది. అంతే కాదు పేపర్ బ్యాలెట్ కి కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా పేర్కొంది.
51 లక్షల ఓట్లు అంటూ :
ఇక 2024 మేలో ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం గురించి ఆ పార్టీ లోక్ సభా నాయకుడు అయిన పీవీ మిధున్ రెడ్డి అనేక డౌట్లు వ్యక్తం చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత 51 లక్షల ఓట్లు అధికంగా నమోదు అయ్యాయి అని చెప్పారు. ఏపీ పోలింగ్ చరిత్రలో ఎన్నడూ చూడని అనూహ్యమైన తీరు ఇది అని ఆయన అన్నారు. అంతే కాదు విజయనగరంలో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఈవీఎంలు పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ లో ఉంటే కౌంటింగ్ వేళకు 99 శాతం ఉన్నాయని ఇది ఎలా సాధ్యమని ఎన్నికల సంఘాన్ని కోరినా తమకు సరైన సమాధానం లేదని పైగా మాక్ పోలింగ్ నిర్వహించినవి వేరే ఈవీఎంలతో అని మిధున్ రెడ్డి లోక్ సభ దృష్టికి తెచ్చారు. ఇక హిందూపురం అసెంబ్లీలో ఒక పోలింగ్ బూత్ లో చూస్తే పార్లమెంట్ లో తమ పార్టీకి 472 ఓట్లు వస్తే అదే రోజు సమాంతరంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం ఒక్క ఓటే వచ్చింది ఇదేలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అయిదుగురు బూత్ ఎజంట్లు వారి కుటుంబాల ఓట్లు కలుపుకున్నా కనీసంగా ముప్పయి ఓట్లు అయినా రావా అని ఆయన నిలదీశారు.
పేపర్ బ్యాలెట్ ముద్దు :
ఈవీఎంల పనితీరు మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ హోదాలో మిధున్ రెడ్డి అత్యున్నత సభలో స్పష్టం చేయడం విశేషం. పేపర్ బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ నే వాడుతున్నాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు ఈవీఎంలు ని హ్యాక్ చేయవచ్చు అని ఎలన్ మస్క్ తో సహా అనేక మంది నిపుణులు కూడా చెప్పిన సంగతికి ఆయన చెప్పారు.
సర్ కి ఓకే :
ఇక పార్లమెంట్ లో సర్ అమలు మీద జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ అన్నీ సక్రమంగా చేస్తే కనుక సర్ అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మిధున్ రెడ్డి వైసీపీ అఫీషియల్ స్టాండ్ ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 51 లక్షల అదనపు ఓట్లు ఏపీలో నమోదు అయ్యాయని మిధున్ రెడ్డి సభలో ప్రస్తావిస్తూంటే అధికార ఎన్డీయే నుంచి టీడీపీ ఎంపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే అదే సమయంలో మిధున్ రెడ్డికి ఇండియా కూటమి నుంచి ఆ వైపు ఎంపీల నుంచి మద్దతు లభించడం విశేషం. ఇక సర్ విషయంలో ఇండియా కూటమి వ్యతిరేకిస్తూంటే వైసీపీ ఓకే చెప్పడం గమనార్హం. ఇక ఈవీఎంల పని తీరు మీద మాత్రం ఇండియా కూటమి ఆలోచనలతో వైసీపీ ఏకీభవించినట్లు అయింది.
