Begin typing your search above and press return to search.

వైసీపీ డిజిటల్ బుక్ పై కీలక అప్ డేట్ ఇచ్చిన సజ్జల!

అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల డిజిటల్ బుక్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Sept 2025 3:45 PM IST
వైసీపీ డిజిటల్  బుక్  పై కీలక అప్  డేట్  ఇచ్చిన సజ్జల!
X

ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనే అంశం అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ పేరు చెబితే తప్పు చేసిన వైసీపీ జనాలు అదిరి, బెదిరి పోతున్నారని కూటమి శ్రేణులు చెబుతోన్న వేళ.. అందుకు కౌంటర్ గా వైసీపీ డిజిటల్ బుక్ ను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో దానికి సంబంధించిన కీలక అప్ డేట్ ను సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల డిజిటల్ బుక్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిజిటల్ బుక్ యాప్ ను ఆయన లాంచ్ చేశారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ ను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కీలక అప్ డేట్ ఇచ్చారు వైసీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా చిత్తూరులో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల... ఈ మేరకు డిజిటల్ బుక్ పై కీలక అప్ డేట్ ఇచ్చారు.

ఇందులో భాగంగా... డిజిటల్ బుక్‌ ను ఇటీవల లాంచ్ చేశామని చెప్పిన సజ్జల... కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు అని అన్నారు. ఈ యాప్ కు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆ ఫిర్యాదులకు సంబంధించిన వీడియోలు రికార్డు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చని అన్నారు.

ఇదే సమయంలో వైసీపీకి 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉందని చెప్పిన సజ్జల... ఓ వర్గం మీడియా వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న వేళ.. ఆ మీడియాను వైసీపీ సోషల్ మీడియా దీటుగా ఎదుర్కొంటోందని అన్నారు. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారని.. మనం డిజిటల్ బుక్ లాం ఛేశామని తెలిపారు.

ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.